రూ.15 కోట్ల విలువ చేసే స్థలం కబ్జా

ABN , First Publish Date - 2021-08-11T19:55:57+05:30 IST

ఆనందపురం(విశాఖపట్నం): కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్టుగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ప్రభుత్వ స్థలాలను కూడా ఆక్రమించేస్తున్నారు.

రూ.15 కోట్ల విలువ చేసే స్థలం కబ్జా

గెడ్డ పోరంబోకుపై అక్రమార్కుల గురి

బినామీలతో అధికార పార్టీ నేతల దందా ! 

స్పందించిన అధికారులు.. హెచ్చరిక బోర్డు ఏర్పాటు 


ఆనందపురం(విశాఖపట్నం): కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్టుగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ప్రభుత్వ స్థలాలను కూడా ఆక్రమించేస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని గండిగుండం గ్రామంలో రూ.15 కోట్లు విలువైన రెండెకరాల గెడ్డ పోరంబోకు భూమి ఆక్రమణకు గురైంది.  వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో సుమారు 25 ఎకరాల జిరాయితీ భూమిని విశాఖకు కొందరు కొనుగోలు చేశారు. ఆ స్థలం వద్దకు చేరేందుకు పక్కనే ఉన్న సర్వే నంబరు 32లోని రెండెకరాల మేర గెడ్డను ఆక్రమించి రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక వైసీపీ నాయకులు ప్రధాన పాత్ర పోషించినట్టు సమాచారం. రెండు రోజులుగా ఆక్రమణ పర్వం కొనసాగుతున్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు.

ఈ వ్యవహారంపై గండిగుండం ఉప సర్పంచ్‌ సియ్యాద్రి సతీష్‌ మాట్లాడుతూ గెడ్డ పోరంబోకు స్థలం కబ్జాకు గురవుతోందని, వర్షం పడితే నీరు పోయేందుకు ఇదే మార్గమని, ఇక్కడి భూములను కొనుగోలు చేసిన బడా బాబులకు మద్దతుగా రోడ్డు వేసేందుకు గెడ్డపోరంబోకును ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. వారికి స్థానిక వైసీపీ నేతలు వత్తాసు పలుకుతున్నారని తహసీల్దార్‌ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన ఆక్రమిత స్థలాన్ని పరిశీలించి, ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 



Updated Date - 2021-08-11T19:55:57+05:30 IST