గుట్టూరు మార్కెట్‌ స్థలం కబ్జా

ABN , First Publish Date - 2022-05-18T06:24:00+05:30 IST

మండలంలోని గుట్టూరు గ్రామ మార్కెట్‌ స్థలం కబ్జా కోరల్లో చిక్కుకుంది. ప్రభుత్వ స్థలంలో యథే చ్ఛగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి.

గుట్టూరు మార్కెట్‌ స్థలం కబ్జా
ఆక్రమణకు గురైన గుట్టూరు మార్కెట్‌ స్థలం

ఇష్టారాజ్యంగా అక్రమ భవన నిర్మాణాలు 

చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు


పెనుకొండ రూరల్‌, మే 17: మండలంలోని గుట్టూరు గ్రామ మార్కెట్‌ స్థలం కబ్జా కోరల్లో చిక్కుకుంది. ప్రభుత్వ స్థలంలో యథే చ్ఛగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. మార్కెట్‌ స్థలం కుంచించు కుపోయింది. దీంతో ఇరుకు స్థలంలో వ్యాపారులు, ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. కియ కార్ల పరిశ్రమ ఈ గ్రామా నికి సమీపంలోనే ఉంది. దీంతో గుట్టూరు చుట్టుపక్కల గ్రామాల్లో భూముల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇదే అదునుగా   కొందరు అక్రమార్కులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై, ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను య థేచ్ఛగా ఆక్రమిస్తూ అక్రమ కట్టడాలు చేపడుతున్నారు. ప్రజల అ వసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు వె లుస్తున్నా, రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


2.50 ఎకరాల్లో మార్కెట్‌ స్థలం

గుట్టూరు నుంచి మునిమడుగుకు వెళ్లే రహదారిలో సర్వే నం బరు 290-1లో 2.50 ఎకరాల భూమిని అప్పట్లో మార్కెట్‌ కోసం అధికారులు కేటాయించారు. అయితే కియ కార్లపరిశ్రమ రావడం తో మార్కెట్‌ స్థలం రోజురోజుకు స్వార్థపరుల చేతికి చిక్కింది. 2.5 ఎకరాల మార్కెట్‌స్థలాన్ని ప్రభుత్వం కేటాయించగా, ప్రస్తుతం అర ఎకరా భూమి మాత్రమే మిగిలింది. కొందరు స్వార్థపరులు ఈ స్థలాన్ని ఆక్రమించుకుని అక్రమ భవన నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో మార్కెట్‌ స్థలమంతా ఆక్రమణకు గురవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇరుకు స్థలంలో కొనుగోలుదారుల అవస్థలు

గుట్టూరు సమీపంలో కియ పరిశ్రమ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడి మార్కెట్‌కు డిమాండ్‌ పెరిగింది. పెనుకొండ, సోమందేప ల్లి, పావగడ, మడకశిర నుంచి అధిక సంఖ్యలో వ్యాపారులు తరలి వస్తున్నారు. ఈపరిస్థితుల్లో మార్కెట్‌లో స్థలంలేక, సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్థులు, వ్యాపారులు వాపోతున్నారు. ఆక్రమించుకున్న భవన యజమానులు మార్కెట్‌ స్థలం పక్కనే హద్దులు పెట్టి కట్టెలు, రాళ్లు వేశారు. దీంతో వ్యాపారులు, ప్రజలకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  యేటా మార్కెట్‌ వేలంపాటలో రూ.లక్షకు పైగా ఆదాయం వస్తున్నా, కనీ స సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని వ్యాపారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి పరిశ్రమ హ బ్‌గా ఉన్న గుట్టూరు గ్రామంలో కేటాయించిన మార్కెట్‌ స్థలం సర్వే చేసి హద్దులు వేయించాలి. లేకపోతే మరిన్ని ఆక్రమణలు వె లిసే అవకాశం ఉందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై వీఆర్‌ఓ బషీర్‌ను వివరణ కోరగా, గుట్టూరులో ఉన్న మార్కెట్‌ స్థలం గ్రామకంఠంలో ఉందన్నారు. త్వరలో ఉన్నతాధికారులకు తెలిపి మార్కెట్‌ స్థలాన్ని సర్వే చేయిస్తామన్నారు.  


కనీస సౌకర్యాలు లేవు 

 - సయ్యద్‌, వ్యాపారి, గుట్టూరు 

కొన్నేళ్లుగా గుట్టూరు మార్కెట్‌ లో కూరగాయల వ్యాపారం చేస్తున్నా. ప్రతి వారం సుంకంగా రూ.100 చెల్లిస్తున్నా. అయితే  మార్కెట్‌లో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మార్కెట్‌కు ఇతర ప్రాంతాల నుం చి వ్యాపారులు వస్తుంటారు. ఇక్కడ సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. 



Updated Date - 2022-05-18T06:24:00+05:30 IST