గుడి పేరుతో భూములు కబ్జా

ABN , First Publish Date - 2022-05-18T05:24:18+05:30 IST

గుడి పేరుతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రైతులను బెదిరించి భూములు కబ్జా చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు.

గుడి పేరుతో భూములు కబ్జా
భూములను పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

అచ్చంపేట, మే17: గుడి పేరుతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రైతులను బెదిరించి భూములు కబ్జా చేస్తున్నారని  టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. మంగళవారం డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి కాంగ్రెస్‌ నాయకులు జినుకుంట గ్రామంలో పర్యటించారు.  ఈ సందర్భం గా రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  మల్లు రవి, వంశీకృష్ణ మాట్లాడుతూ  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కనకాల మైసమ్మ దేవాలయానికి గతంలో కొంత భూమిని తీసుకొని గుడి నిర్మించా రన్నారు. గుడి పేరుతో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  తన పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, కార్యకర్తలు, రైతులు  పాల్గొన్నారు. 

రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

 వెల్దండ : కాంగ్రెస్‌పార్టీ ఇటీవల వరంగల్‌ సభ సాక్షిగా ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రతీ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లురవి పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మల్లురవి మాట్లాడుతూ రాష్ట్రంలోని 12వేల గ్రామాలలో పార్టీ నియమించిన నాయకులు రచ్చబండల వద్ద ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రైతు డిక్లరేషన్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 28 నుంచి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విఽదానాలను కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి అడ్డుకోవాలని కోరారు.  సమావేశంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మోతీలాల్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వెంకటయ్యగౌడ్‌, నాయకులు పుల్లయ్య, తిరుపతిరెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2022-05-18T05:24:18+05:30 IST