ప్రభుత్వ భూమి ఆక్రమించి వైన్సకు లీజు

ABN , First Publish Date - 2021-12-03T06:58:21+05:30 IST

ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అందులో నిర్మాణాలు చేపట్టి వైన్స షా పునకు లీజుకు ఇచ్చిన సంఘటన మండలకేంద్రం లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వ భూమి ఆక్రమించి వైన్సకు లీజు
ప్రభుత్వ భూమి ఆక్రమణను పంచనామ చేస్తున్న రెవెన్యూ అధికారులు

మోతె, డిసెంబరు 2: ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అందులో నిర్మాణాలు చేపట్టి వైన్స షా పునకు లీజుకు ఇచ్చిన సంఘటన మండలకేంద్రం లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం ఆ క్రమణకు గురైన భూమిని రెవెన్యూ ఆర్‌ఐ మన్సూర్‌అలీ పరిశీలించి మాట్లాడారు. మండల కేంద్రానికి చెందిన సామ వెంకట్‌రెడ్డి 169 సర్వే నెంబరులో ఉ న్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అందులో  నిర్మాణాలు చేపట్టారు. ఈ ఆక్రమణపై గతేడాది  గ్రామానికి చెందిన రెంటాల కృష్ణ కలెక్టర్‌, తహసీ ల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వాటిని తొలగించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం మండల రెవెన్యూ సిబ్బందితో పాటు సర్వేయర్‌ కలిసి రికార్డుల ప్రకారం సర్వే చేశారు. 169లో సామ వెంకట్‌రెడ్డి 5 గుంటలు ఆక్రమించుకుని అం దులో వైన్సషాపునకు నిర్మాణాలు చేపట్టినట్లు తేలింది. బాబు రత్నాకర్‌ మరో 5 గుంటల భూమిని ఆక్రమించుకున్నట్లు తేలింది. సర్వే చేస్తుండగా వైన్సషాపు నిర్వాహకులు, అధికారులతో వాగ్వాదానికి దిగి ఘర్షణ పడ్డారు. రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులు ఐదు రోజుల్లో తొలగించాలని సూచించడంతో వాగ్వాదం సద్దుమణిగింది. కా ర్యక్రమంలో సర్వేయర్‌, భాస్కర్‌, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-03T06:58:21+05:30 IST