Abn logo
Aug 3 2021 @ 22:47PM

ఆక్రమించిన భూములను ఖాళీ చేయాలి

ఆక్రమణదారులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ జ్యోత్స్న

భీమారం, ఆగస్టు 3: మండల కేంద్రంలోని 138 సర్వే నెంబరులో అక్రమం గా నిర్మించుకున్న ఇండ్లను, పెరడు స్థలాలను ఖాళీ చేయాలని తహసీల్దార్‌ జ్యోత్స్న హెచ్చరించారు. మంగళవారం అదే సర్వే నెంబరులో చేపడుతున్న బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు. తహసీల్దార్‌ మాట్లాడు తూ పల్లె ప్రకృతి వనానికి సమీపంగా ఉన్న ఎకరం స్థలాన్ని సూరం రాజయ్య, రావుల ఎల్లక్క, ముస్క నర్సక్కలు ఆక్రమించుకొన్నారని, రెండు రోజుల్లో ఖాళీ చేయాలని, లేకపోతే ఇండ్లను కూల్చివేస్తామని ఆమె హెచ్చరించారు. బాధితు లు మాట్లాడుతూ మరోచోట స్థలంతోపాటు ఇండ్లు నిర్మించుకునేందుకు పరిహా రం అందించాలని, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లేదని కోరారు. ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండ ఎస్‌ఐ అశోక్‌ బందోబస్తు నిర్వహించారు. ఆర్‌ఐ అరుణ, ట్రైనీ ఎస్‌ఐ మనోజ్‌, మహిళ ఎస్‌ఐ శకుంతల పాల్గొన్నారు.