ఆక్రమిత స్థలాలపై విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2021-06-15T04:55:13+05:30 IST

మైలవరం మండలం దొ మ్మరనంద్యాల గ్రామం శివా రెడ్డి కాలనీలో ఆక్రమిత స్థలా లు, భోగస్‌ ఇంటి పట్టాలపై విచారణ జరిపించాలని స్థాని కులు డిమాండ్‌ చేశారు.

ఆక్రమిత స్థలాలపై విచారణ జరిపించాలి
ఎమ్మెలే ్య సుధీర్‌రెడ్డిని కలిసి సమస్యను వివరిస్తున్న దొమ్మరనంద్యాల గ్రామ ప్రజలు

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి దొమ్మరనంద్యాల వాసుల  వినతి

జమ్మలమడుగు రూరల్‌, జూన్‌ 14: మైలవరం మండలం దొ మ్మరనంద్యాల గ్రామం  శివా రెడ్డి కాలనీలో ఆక్రమిత స్థలా లు, భోగస్‌ ఇంటి పట్టాలపై  విచారణ జరిపించాలని స్థాని కులు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు సోమవారం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన ఇళ్లులేని పేదలు, వైసీపీ నాయ కులు జమ్మలమడుగు వైసీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కలిసి  జరిగిన అక్రమాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వినతిపత్రాలు అంద జేశారు. శివారెడ్డి కాలనీలో ఇంటి స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని ఈ ఏడాది మార్చి 31వ తేదీ మైలవరం తహసీల్దారుగా  పదవీ విరమణ చేసిన  శివరామయ్య  పదవీ విరమణకు ముందు ఒక్కో పట్టాకు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసుకుని భోగస్‌ ఇంటి పట్టాలు ఇచ్చినట్లు వారు ఎమ్మెల్యేకు వివరించారు. శివారెడ్డి కాలనీలో   సెంటు స్థలం రూ.2 లక్షలకుపైగా  ధర పలుకుతోందని దీంతో తహసీల్దారు శివరామ య్య ఇచ్చిన పట్టాలను రద్దుచేసి అర్హులకు ఇంటి పట్టాలు వచ్చేలా న్యాయం చేయాలని వారు కోరారు.  దొమ్మరనంద్యాల గ్రామంలో చేనేత కార్మికులు ఇళ్లులేక అద్దెలు కట్టలేక  ఇబ్బంది పడుతున్నారని, అలాంటివారిని గుర్తించి స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌కు సమస్యలు తెలియజేసి పేదలకు  న్యాయం జరిగేలా తప్పక కృషి చేస్తానని ఆయన తెలిపారు. 


Updated Date - 2021-06-15T04:55:13+05:30 IST