అధికారుల అండతో ప్రభుత్వ భూమి కబ్జా

ABN , First Publish Date - 2022-05-10T06:03:43+05:30 IST

జిల్లా కేంద్రంలోని గంజ్‌ పక్కన గల సర్వేనంబర్‌ 6లోని ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారుల అండతో కబ్జా చేశారని బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి రమణారెడ్డి ఆరోపించారు.

అధికారుల అండతో ప్రభుత్వ భూమి కబ్జా

కామారెడ్డిటౌన్‌, మే 9: జిల్లా కేంద్రంలోని గంజ్‌ పక్కన గల సర్వేనంబర్‌ 6లోని ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారుల అండతో కబ్జా చేశారని బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి రమణారెడ్డి ఆరోపించారు. సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌కు దేవేందర్‌కు కబ్జాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో రేకుల షెడ్డు వేసి, ఇంటి నంబర్‌ తీసుకుని, పోజిషియన్‌ ఆక్యుపెన్సి సర్టిఫికేట్‌, అసెస్‌మెంట్‌ ఆర్డర్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకుని కబ్జా చేస్తున్నారని, మున్సిపల్‌, రిజిస్ట్రేషన్‌ అధికారులు సహకరించడంతోనే జరుగుతోందని విమర్శించారు.   వీఎల్‌టీ విషయంలో మున్సిపల్‌ అఽధికారులకు సంబంధం లేకుండా సెల్ప్‌ డిక్లరేషన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌  చేస్తూ అక్రమాలకు తావిస్తున్నారని, స్వయంగా మున్సిపల్‌ అధికారులు పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రభుత్వ భూమిని మున్సిపల్‌ అధికారులు స్వాధీనం చేసుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి తేలు శ్రీను, అసెంబ్లీ కన్వీనర్‌ లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి సురేష్‌, ప్లోర్‌ లీడర్‌ శ్రీకాంత్‌, కౌన్సిలర్‌ ప్రవీణ్‌, నాయకులు శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more