యథేచ్ఛగా వాగుల ఆక్రమణ

ABN , First Publish Date - 2022-05-23T05:25:39+05:30 IST

అద్దంకిలో పలుచోట్ల వాగులు ఆక్రమణలకు గురవుతున్నాయి.

యథేచ్ఛగా వాగుల ఆక్రమణ
అద్దంకిలోని శింగరకొండ రోడ్డులో ఆక్ర మించేందుకు సిద్ధం చేస్తున్న ఊరచెరువుకు వచ్చే వాగు

 చిన్నపాటి వర్షం కురిసినా  పొంగి పొర్లుతున్న వాగులు

పట్టించుకోని అధికారులు

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

అద్దంకి, మే 22: అద్దంకిలో పలుచోట్ల వాగులు ఆక్రమణలకు గురవుతున్నాయి. దీంతో వర్షం వస్తే నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారి పొంగి పొర్లుతు న్నాయి. ప్రధానంగా పట్టణంలో అంతర్భాగమైన ఊర చెరువు గతంలో నీటితో జలకల ఉట్టిపడేది. చెరువులో కొంతభాగం ఆక్రమణకు గురికావటం, ఇక వాగులు ఏటికేడు ఆక్రమణలకు గురవుతుండటంతో నీటి ప్రవాహం ముందుకు  కదిలే పరిస్థితి  లేదు. ఊరచెరువుకు నీరు చేరేందుకు మూడు వాగులు ఉన్నాయి. వర్షపు నీరు వాగుల ద్వారా  ఊ రచెరువు కు చేరేది. అయితే, ఇప్పటికే రెండు వాగులు అత్యధిక  శాతం ఆక్రమణలకు  గురై మురుగు నీటి కాలువలుగా మారాయి. తాజాగా మరో వాగు  కూడా ఆక్రమించేందుకు అధికార  పార్టీకి చెందిన మహిళా నేత ప్రయత్నాలు చేపట్టింది.  ఈక్ర మంలో ఇప్పటికే  వాగు చెంతనే భవనాల వ్యర్థాలు తోలారు. వాటిని చదును చేసి వాగును పూడ్చేందుకు సిద్ధం చేస్తున్నట్లు స్థానికులు ఆరో పిస్తున్నారు. 

బల్లికురవ మండలంలో నల్లవాగును పలువురు గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులు ఆ క్రమించి వ్యర్థా లను డంప్‌ చేస్తున్నారు. భవనాసి  చెరువుకు వచ్చే భవనాసి  వాగు కూడా పలు చోట్ల  ఆక్రమణలకు గురైంది. అద్దంకి మండలంలోని నల్లవాగును కూడా పలు ప్రాంతాలలో స్థానికులు ఆక్రమించారు. ఇలా పలు  చోట్ల వాగులు ఆక్రమణలకు  గురవుతుండ టంతో  చిన్నపాటి  వర్షం  పడ్డా వాగులు పొంగి పొ ర్లుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాగులలో ఉన్న ఆ క్రమణలు తొలగించాలని ఆయా ప్రాంతాల ప్రజలు  కోరుతు న్నారు.

Updated Date - 2022-05-23T05:25:39+05:30 IST