Abn logo
Sep 21 2021 @ 23:26PM

తునివాడ ఇసుకరీచ్‌ పరిశీలన

ఇసుక రీచ్‌పై ఆరా తీస్తున్న పాలకొండ ఆర్డీవో, డీఎస్పీలు

రేగిడి: మండలంలోని తునివాడ నాగావళీ తీరంలో ఇసుక రీచ్‌ కేటాయింపునకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై పాలకొండ ఆర్డీవో టీవీజీఎస్‌ కుమార్‌, డీఎస్పీ శ్రావణి మంగళవారం పరిశీలించారు. జగనన్న ఇళ్లు, ఇంకా ప్రభుత్వ అవసరాలకు ఇక్కడ క్వారీ కేటాయించి ఈమేరకు చర్యలు చేపట్టాలని జేసీ ఆదేశాలపై పరిశీలించినట్లు తహసీల్దార్‌ బి.సత్యం తెలిపారు. అయితే నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పాటు గ్రామ స్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్వారీ సమీపంలో గ్రామానికి అవసరమైన వంతెన, రక్షితనీటి సోర్స్‌ ఉన్నాయని, ఇసుక తరలించే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.  

 (21రేగిడి 1)