నీట మునిగిన పంట పొలాల పరిశీలన

ABN , First Publish Date - 2022-08-07T05:06:27+05:30 IST

వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను శనివారం తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్‌, వ్యవసాయశాఖ ఎఓ వీరనరేష్‌ పరిశీలించారు.

నీట మునిగిన పంట పొలాల పరిశీలన
మడకశిర మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న తహసీల్దార్‌ఆనంద్‌కుమార్‌

మడకశిరరూరల్‌/మడకశిరటౌన/సోమందేపల్లి, ఆగస్టు 6: వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను శనివారం తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్‌, వ్యవసాయశాఖ ఎఓ వీరనరేష్‌ పరిశీలించారు. మడకశిర మండలంలోని క ల్లుమర్రి చెరువు కింద నీట మునిగిన మొక్కజొన్న పంటను రైతుల తో కలిసి పరిశీలించారు. భారీ వర్షాలకు మండల వ్యాప్తంగా మొ క్కజొన్న పంటలు 700 ఎకరాలు, వేరుశనగ 250, పత్తి 300 ఎకరాలు, మిరప, మల్బరీ, పొద్దుతిరుగు 250 ఎకరాల్లో నష్టపోయినట్టు  పేర్కొన్నారు. ఛత్రం, ఆర్‌ అనంతపురం, కల్లుమర్రి, మడకశిర, గౌడనహళ్ళి, మెళవాయి, వైబీ హళ్ళి పంచాయతీ పరిధిలో ఎక్కవగా  నష్టం వాటిల్లిదన్నారు. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత మరోసారి ప ర్యటించి  పంట నష్టాన్ని నమోదు చేయనున్నట్లు తెలిపారు. వారి వెంట రైతులు, వ్యవసాయ, రెవెన్యూ  శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని  మెళవాయి- గుండుమల ప్రధాన రహదారిలో పె ద్ద చింతచెట్టు రోడ్డుకు అడ్డంగా కూలింది. దీంతో ప్రయాణీకులు ఇ బ్బందులు  పడ్డారు. వంక కోతకు గురి కావడంతో పక్కనే ఉన్న  చింతచెట్టు రోడ్డుపై పడినట్టు గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి  రోడ్డుకు అడ్డంగా పడిన చింతచెట్టును  తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. మడకశిర చెరువు మరువ పారి నీట మునిగిన పంటలను అధికారులు పరిశీలించారు. మరువు ఉధృతికి కట్ట కింది పంట పొలాలకు పూర్తిగా నీరు చేరాయి. పంట మునగడంతో ఆ ప్రాంతంలో నషాం్టన్ని అంచనా వేస్తున్నామన్నారు. పరిహారం కో సం ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలపారు.


అప్రమత్తంగా ఉండాలి 

ఇటీవల కురుస్తున్న వర్షాలకు సోమందేపల్లి మండలంలోని పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ సూచించారు. చిన్నపాటి వాగే కదా అంటూ దిగి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని తెలిపారు. నీటి కుంటల వద్దకు పిల్లలు వెళ్లకుండా పెద్దలు జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. వివిధ గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చే వి ద్యార్థుల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండా లన్నారు. మండలంలోని అన్ని చెరువులు నీటితో నిండటంతో చెరువుల వద్దకు వెళ్లవద్దని సూచించారు.


Updated Date - 2022-08-07T05:06:27+05:30 IST