చంద్రబాబు రోడ్‌ మ్యాప్‌ పరిశీలన

ABN , First Publish Date - 2022-07-07T07:14:01+05:30 IST

నగరిలో శుక్రవారం జరిగే టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోకు సంబంధించిన రోడ్‌మ్యాపు మాజీ హోంమంత్రి చినరాజప్ప బుధవారం సాయంత్రం పరిశీలించారు.

చంద్రబాబు రోడ్‌ మ్యాప్‌ పరిశీలన
చంద్రబాబు రోడ్‌ మ్యాప్‌ను పరిశీలిస్తున్న చినరాజప్ప, భానుప్రకాష్‌

నగరి, జూలై 6: నగరిలో శుక్రవారం జరిగే టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోకు సంబంధించిన రోడ్‌మ్యాపు మాజీ హోంమంత్రి చినరాజప్ప బుధవారం సాయంత్రం పరిశీలించారు. నగరి టీడీపీ ఇన్‌చార్జి గాలి భానుప్రకాష్‌, చిత్తూరు పార్లమెంట్‌ అధికారప్రతినిధి చినబాబు తదితరులతో కలిసి ఓంశక్తి గుడి వద్ద నుంచి టవర్‌క్లాక్‌ వద్ద జరిగే బహిరంగ సభ స్థలాన్ని సత్రవాడ వరకు రోడ్‌షోకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ను పరిశీలించారు. రోడ్‌షోను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు రమే్‌షబాబు, నరకం బాలాజీ, టీఎన్‌టీయూసీ బాలాజీ, జ్యోతినాయుడు, సురే్‌షనాయుడు, కృష్ణారెడ్డి, గుణశేఖర్‌, ఖాదర్‌బాయ్‌, వెంకి, అశోక్‌, అల్లిముత్తు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T07:14:01+05:30 IST