Abn logo
Mar 2 2021 @ 21:12PM

బోటింగ్‌ ఏర్పాటుకు పరిశీలన

మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద బోటింగ్‌ ఏర్పాటుకు పరిశీలిస్తున్న అధికారులు

హాజీపూర్‌, మార్చి 2: ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద బోటింగ్‌ ఏర్పాటు కోసం ప్రాజెక్టును అధికారులు మంగళవారం పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి కోటిలింగాల వరకు బోటింగ్‌ ఏర్పాటుకు అధికారులు ప్రాజెక్టును సందర్శించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం గుడిపేట గ్రామ శివారులోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మైదానంలో పర్యాటకుల కోసం బోటింగ్‌ ఏర్పాటు చేయడానికి తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌ మహ్మద్‌ ఇబ్రహీం, డిప్యూటీ మేనేజర్‌ ఉపేంద్రలు ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కోటిలింగాల వరకు వంద సీట్ల సౌకర్యం గల డబుల్‌ డెక్కర్‌ బోటింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రెండు నెలలలోపు బోటింగ్‌ ప్రారంభం చేయనున్నామని తెలిపారు. వారి వెంట స్థానిక సర్పంచ్‌ లగిశెట్టి లక్ష్మిరాజయ్య, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్‌, మాజీ వైస్‌ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్‌, రైతు సమితి మండల కన్వీనర్‌ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్‌రావు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement