శివుడి పేరుతో అసభ్యకర పోస్టింగ్‌.. సుమోటో కేసు

ABN , First Publish Date - 2021-06-08T12:11:20+05:30 IST

హిందువుల ఆరాధ్య దైవమైన శివుడిని అసభ్యంగా చిత్రీకరిస్తూ...

శివుడి పేరుతో అసభ్యకర పోస్టింగ్‌.. సుమోటో కేసు

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : హిందువుల ఆరాధ్య దైవమైన శివుడిని అసభ్యంగా చిత్రీకరిస్తూ రూపొందించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ‘యూ యూకే డాట్‌ ఇన్‌’ వెబ్‌సైట్‌పై సుమోటోగా కేసు నమోదు చేశామని హైదరాబాద్‌ సైబర్‌  క్రైం ఏసీపీ కేవీఎమ్‌ ప్రసాద్‌ తెలిపారు. మరోవైపు విశాల్‌శర్మ అనే వ్యక్తి ఈ వీడియోను రాష్ట్ర స్థాయి నేతలకు, హైదరాబాద్‌ సిటీ పోలీసులకు ట్యాగ్‌ చేసి ట్విటర్‌ లో పోస్ట్‌ చేయడంతో మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు వెంటనే స్పందించారు. ఇలాంటి వీడియో రూపొందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్విటర్‌లో రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తూ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2021-06-08T12:11:20+05:30 IST