Bhadradri దివ్యక్షేత్రం పేరుతో ఫేస్బుక్లో అసభ్య ఫొటోలు
ABN , First Publish Date - 2022-06-08T18:25:27+05:30 IST
భద్రాద్రి దివ్యక్షేత్రం పేరుతో ఫేస్బుక్లో అసభ్య ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి దివ్యక్షేత్రం పేరుతో ఫేస్బుక్లో అసభ్య ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. గత రెండు రోజులుగా ఆగంతకులు ఫేస్బుక్లో అసభ్య ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రామ భక్తులు ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే దేవస్థానం పేరుతో ఫేస్బుక్ అకౌంట్ లేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై ఏఎస్పీకి ఆలయ అధికారులు, భక్తులు ఫిర్యాదు చేశారు.