ఒంటరిగా ఉన్న యువతిపై అసభ్య ప్రవర్తన..తర్వాత తండ్రికి ఫోన్‌ చేసి..

ABN , First Publish Date - 2022-01-12T16:01:20+05:30 IST

ఓ వ్యాపారి కూతురు ఇంట్లో ఒం టరిగా ఉన్న సమయంలో వచ్చిన ఆగంతుకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తర్వాత ..

ఒంటరిగా ఉన్న యువతిపై అసభ్య ప్రవర్తన..తర్వాత తండ్రికి ఫోన్‌ చేసి..

హైదరాబాద్/బోయినపల్లి: ఓ వ్యాపారి కూతురు ఇంట్లో ఒం టరిగా ఉన్న సమయంలో వచ్చిన ఆగంతుకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తర్వాత ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశారు. బోయిన్‌పల్లి సీఐ రవికుమార్‌ కథనం ప్రకారం.. డెయిరీ ఫారం రోడ్డుకు చెందిన ఒకరు జీడిమెట్లలో ఓ రసాయన పరిశ్రమ నడుపుతున్నారు. సోమవారం ఆయన తన కుమారుడితో కలిసి పరిశ్రమ వద్దకు వెళ్లగా, అతని భార్య పక్కింటికి వెళ్లింది. ఇంట్లో వ్యాపారి కుమార్తె ఒక్కర్తే ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి, వ్యాపారి.. అతడి భార్య గురించి ఆరా తీశారు. ఇంట్లో లేరని కుమార్తె చెప్పగా, ఆమె చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కోవడంతో పాటు ఆమె నోరు మూసే ప్రయత్నం చేశారు. అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె ఇరువురిని నెట్టేసి, కేకలు వేసింది. దీంతో వారు పరారయ్యారు. జరిగిన విషయం భర్తకు చెప్పడంతో ఆయన ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో వివిధ నంబర్ల నుంచి వ్యాపారికి ఫోన్‌ చేసి, రూ. కోటి ఇవ్వాలని.. లేకుంటే కుటుంబాన్ని కాల్చి చంపుతామని బెదిరించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల సహాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్త్నుట్లు సీఐ రవికుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-01-12T16:01:20+05:30 IST