కుమారుడు మేజరైనంత మాత్రాన తండ్రి బాధ్యత తీరిపోదు: హైకోర్టు

ABN , First Publish Date - 2021-06-24T03:59:15+05:30 IST

కుమారుడికి పద్ధెనిమిదేళ్లు వచ్చినంత మాత్రాన తండ్రి బాధ్యతలు తీరిపోవని, అతడి చదువుకు సంబంధించిన ఖర్చంతా తల్లి మాత్రమే భరించాలనడం సబబు కాదని ఢిల్లీ హైకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది.

కుమారుడు మేజరైనంత మాత్రాన తండ్రి బాధ్యత తీరిపోదు: హైకోర్టు

న్యూఢిల్లీ: కుమారుడికి పద్ధెనిమిదేళ్లు వచ్చినంత మాత్రాన తండ్రి బాధ్యతలు తీరిపోవని, అతడి చదువుకు సంబంధించిన ఖర్చంతా తల్లి మాత్రమే భరించాలనడం సబబు కాదని ఢిల్లీ హైకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. భార్యకు ఇంటి నిర్వహణ ఖర్చుల కింద నెలకు రూ. 15 వేలు భర్త చెల్లించాలంటూ తీర్పిచ్చింది. అతడి చదువు పూర్తయ్యేవరకూ లేదా ఉద్యోగం సంపాదించే వరకూ భర్త ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. విడాకుల తరువాత భార్యకు మనోవర్తి ఇవ్వడానికి అసలు కారణంగా ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూడటమేనని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా.. కేసు వివరాల ప్రకారం.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో అప్పర్ డివిజనల్ కర్క్‌గా పనిచేస్తున్న భార్య జీతం నెలకు రూ. 60 వేలు  కాగా.. భర్త నెల జీతం సుమారు రూ. 1.27లక్షలు.

Updated Date - 2021-06-24T03:59:15+05:30 IST