Objectionable images నెట్‌లో పెడతామంటూ బెదిరింపు

ABN , First Publish Date - 2021-10-14T16:45:38+05:30 IST

డబ్బులు ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న అభ్యంతకర చిత్రాలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ ఓ వ్యక్తిని బెదిరించిన సైబర్‌ నేరగాళ్ల పై కేసు నమోదైంది. బంజారాహిల్స్‌

Objectionable images నెట్‌లో పెడతామంటూ బెదిరింపు

హైదరాబాద్/బంజారాహిల్స్‌: డబ్బులు ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న అభ్యంతకర చిత్రాలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ ఓ వ్యక్తిని బెదిరించిన సైబర్‌ నేరగాళ్ల పై కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌.12 బోలానగర్‌కు చెందిన మహ్మద్‌ గౌస్‌ ఎలక్ట్రీషియన్‌. ఈ యేడాది జూలై 26న అతడి ఫేస్‌బుక్‌కు ఓ యువతి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించింది. అనంతరం ఇద్దరు తరచూ చాటింగ్‌ చేసేవారు. ఓ రోజు ఆమె వీడియో కాల్‌ చేసి అర్ధనగ్నంగా ప్రవర్తించింది. గౌస్‌ను కూడా అలాగే చేయాలని చెప్పింది. మొదట గౌస్‌ ఒప్పుకున్నాడు. ఆ తరువాత వ్యతిరేకించాడు. ఈ క్రమంలో కొన్ని చిత్రాలు రికార్డు అయ్యాయి. అప్పటి నుంచి ఆమె ఐడీని బ్లాక్‌ చేశాడు. ఇదిలా ఉండగా గత నెలలో అతడి అభ్యంతరకర చిత్రాలను సైబర్‌ నేరగాళ్లు అతడి స్నేహితులకు పంపించారు. ఆ తరువాత ఓ వ్యక్తి ఫోన్‌ చేసి అభ్యంతరకర చిత్రాలు తొలగించాలంటే డబ్బులు కావాలని వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన గౌస్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-14T16:45:38+05:30 IST