వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసిన జో బైడెన్‌కు.. యూఎస్ మాజీ అధ్యక్షుడు ఒబామా కంగ్రాట్స్ చెప్పారు. ప్రమాణ స్వీకార వేడుక జరగడానికి ముందే ఒబామా ట్వీట్ చేశారు. వైట్ హౌస్‌లో తనతోపాటు నడుస్తున్న బైడెన్ ఫొటోను ఆయన షేర్ చేశారు. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2009-2017 మధ్య బైడెన్ ఉపాధ్యక్షుడిగా సేవలందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒబామా ట్వీట్ చేస్తూ.. ‘‘నా మిత్రుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అభినందనలు. ఇది నీ టైం’’ అని ఒబామా పేర్కొన్నాడు.