ఓట్స్‌- క్యాప్సికమ్‌ సూప్‌

ABN , First Publish Date - 2021-09-13T21:10:46+05:30 IST

ఓట్స్‌- 5 స్పూన్లు (వేయించినవి), ఎర్ర క్యాప్సికమ్‌- రెండు, టమోటా ముక్కలు - రెండు కప్పులు, బిర్యానీ ఆకులు- రెండు, అల్లం ముద్ద- అర స్పూను, కారప్పొడి- స్పూను, ఉప్పు- తగినంత.

ఓట్స్‌- క్యాప్సికమ్‌ సూప్‌

కావలసిన పదార్థాలు: ఓట్స్‌- 5 స్పూన్లు (వేయించినవి), ఎర్ర క్యాప్సికమ్‌- రెండు, టమోటా ముక్కలు - రెండు కప్పులు, బిర్యానీ ఆకులు- రెండు, అల్లం ముద్ద- అర స్పూను, కారప్పొడి- స్పూను, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: క్యాప్సికమ్‌ను మంట మీద కాల్చాలి. చల్లారాక పై పొట్టు, గింజలు, కాడ తొలిగించి ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో టమోటా ముక్కలు, బిర్యానీ ఆకులు, అల్లం ముద్ద వేసి, రెండున్నర కప్పుల నీళ్లు కలిపి పది నిమిషాలు ఉడికించి చల్లార్చాలి. ఇందులోంచి బిర్యానీ ఆకుల్ని తీసేసి, క్యాప్సికమ్‌ ముక్కల్ని వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. లోతైన పాన్‌లో ఈ మిశ్రమాన్ని వేసి దీనికి కారం, ఉప్పు, అర కప్పు నీళ్ళు పోసి ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. తరవాత ఓట్స్‌ కలిపి ఓ రెండు నిమిషాలు ఉడికిస్తే సూప్‌ రెడీ.

Updated Date - 2021-09-13T21:10:46+05:30 IST