O Panneerselvam: సుప్రీంకోర్టులో ఓపీఎస్‏కు చుక్కెదురు !

ABN , First Publish Date - 2022-07-30T13:59:52+05:30 IST

అన్నాడీఎంకే శాసనసభాపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) నాయకత్వంలో నిర్వహించిన సర్వసభ్యమండలి చెల్లదని

O Panneerselvam: సుప్రీంకోర్టులో ఓపీఎస్‏కు చుక్కెదురు !

                                   - హైకోరును ఆశ్రయించాలంటూ సూచన 


చెన్నై, జూలై 29 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే శాసనసభాపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) నాయకత్వంలో నిర్వహించిన సర్వసభ్యమండలి చెల్లదని ఉత్తర్వులివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన మాజీ ముఖ్యమంత్రి ఒ పన్నీర్‌సెల్వం(O Panneerselvam) చుక్కెదురైంది. ఈ విషయంలో మళ్ళీ హైకోర్టును ఆశ్రయించమంటూ సూచించింది. ఈ నెల 11న ఈపీఎస్‌ అధ్యక్షతన సర్వసభ్యమండలి సమావేశం జరిపేందుకు హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, పార్టీ సమన్వయకర్తగా ఉన్న తన అనుమతి లేకుండా జరిగిన ఆ సమావేశం చెల్లదంటూ ప్రకటించాలని కోరుతూ ఓపీఎస్‌(OPS) సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్వీ రమణ నాయకత్వంలో థర్మాసనం ఎదుట ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది.  అన్నాడీఎంకే పార్టీ నియమనిబంధనలు పూర్తిగా ఉల్లఘించారని  ఓపీఎస్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది గురు కృష్ణకుమార్‌(Guru Krishnakumar) ఆరోపించారు. న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటూ ప్రస్తుతం ప్రత్యర్థులుగా వ్యవహరిస్తున్న ఓపీఎస్‌, ఈపీస్‌ మళ్ళీ ఒకే వర్గంగా వ్యవహరించే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. దీంతో ఈపీఎస్‌, ఓపీఎస్‌(EPS, OPS) తరఫు న్యాయవాదుల్లో కలకలం రేగింది. కొందరు న్యాయవాదులు ఇద్దరూ కలిసే ఆస్కారం లేదని, మరికొందరు  కలిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ధర్మాసనం ఇద్దరూ ఒక్కటయ్యే విషయాన్ని పక్కనబెట్టి సర్వసభ్యమండలి వ్యవహారంలో ఎలాంటి నిబంధనలు ఉల్లఘించారని ప్రశ్నించారు. ఓపీఎస్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ  సర్వసభ్యమండలి నిర్వహణే చట్టవిరుద్ధమని, పార్టీ సమన్వయకర్త అంగీకారం లేకుండా జరిపారని ఓపీఎ్‌సను పార్టీ నుండి కూడా బహిష్కరించారని, ఈ కారణాల వల్లే ఆ సమావేవం చెల్లదని ఉత్తర్వులివ్వాలని కోరుతున్నామన్నారు. సర్వసభ్యమండలి సమావేశంలో ఎలాంటి నిబంధనలు ఉల్లఘించలేదని, పార్టీలో సర్వసభ్యమండలికే సర్వాధికారాలు ఉన్నాయని ఈపీఎస్‌ తరఫు న్యాయవాదులు తెలిపారు. దీంతో న్యాయమూర్తులు ఈ వ్యవహారంలో మళ్ళీ తాము మునుపటి స్థితిని తీసుకురాలేమ చెబుతూ ఈ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టుకే పంపుతున్నామని, హైకోర్టు మూడు వారాలల్లోగా విచారణ జరిపి నిర్ణయాన్ని ప్రకటించాలని ఆదేశించారు.

Updated Date - 2022-07-30T13:59:52+05:30 IST