Hearing today: ఓపీఎస్‌ పిటిషన్‌పై నేడు విచారణ

ABN , First Publish Date - 2022-07-29T13:23:14+05:30 IST

అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం చెల్లదని ప్రకటించాలంటూ మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(O. Panneerselvam) దాఖలు చేసిన

Hearing today: ఓపీఎస్‌ పిటిషన్‌పై నేడు విచారణ

                                           - ఈపీఎస్‌ కెవియట్‌ 


చెన్నై, జూలై 28 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం చెల్లదని ప్రకటించాలంటూ మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(O. Panneerselvam) దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. పార్టీ సమన్వయకర్త, కోశాధికారినైన తన అనుమతి లేకుండా ఎడప్పాడి పళనిస్వామి ఈ నెల 11న సర్వసభ్యమండలిని నిర్వహించి పార్టీ నియమాలను సైతం సవరించారని ఆ పిటిషన్‌(Petition)లో ఓపీఎస్‌ ఆరోపించారు. ఆ సర్వసభ్యమండలికి అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు(Madras High Court) సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును కూడా రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఈపీఎస్‌ తరఫున గురువారం సుప్రీంకోర్టులో కెవియట్‌ దాఖలైంది. పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శి ఎస్పీ వేలుమణి(Velumani) పేరుతో ఆ పిటిషన్‌ దాఖలైంది. అన్నాడీఎంకేలో ప్రస్తుతం సమన్వయకర్త పదవి లేదని, పార్టీ నియమనిబంధనలకు అనుగుణంగా సర్వసభ్యమండలి సమావేశాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఓపీఎస్‌ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై ఏదైనా ఉత్తర్వులిచ్చే ముందు తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. 

Updated Date - 2022-07-29T13:23:14+05:30 IST