Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 20 May 2022 17:29:13 IST

దర్శకేంద్రుడి చేతుల మీదుగా ‘ఓ మై లవ్‌’(oh my love) టీజర్

twitter-iconwatsapp-iconfb-icon

అక్షిత్‌ శశికుమార్‌, కీర్తి కల్కరే జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఓ మై లవ్‌’.(Oh my love) స్మైల్‌ శ్రీను దర్శకత్వంలో జి.రామంజిని కన్నడ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం టీజర్ ను దర్శకేంద్రడు కె.రాఘవేంద్రరావు (K raghavendrarao)విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘టీజర్‌ బావుంది. కన్నడలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రావడం ఆనందంగా ఉంది. యూత్‌ఫుల్‌ లవ్‌ సబ్జెక్ట్‌ తీసుకుని అందంగా చిత్రీకరించారు’’ అని అన్నారు.


దర్శకుడు మాట్లాడుతూ ‘‘మాతరం దర్శకులకు, ఇప్పటి యువ దర్శకులకు రాఘవేంద్రరావు ‘గాడ్‌ ఫాదర్‌’. మా సినిమాకు ఆయన బ్లెసింగ్స్‌ దొరకడం చాలా ఆనందంగా ఉంది. చక్కని ప్రేమకథతో యూత్‌ని ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌ అర్జున్‌. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International