వేడుకల్లో పాల్గొన్న మంత్రి, కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-10-27T11:26:45+05:30 IST

వేల్పూర్‌ మండల అన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం దసరా పండగా సం బురాలను ప్రజలు ఆనందోత్సహాల మధ్య జ రుపుకొన్నారు.

వేడుకల్లో పాల్గొన్న మంత్రి, కలెక్టర్‌

వేల్పూర్‌, అక్టోబరు26: వేల్పూర్‌ మండల అన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం దసరా పండగా సం బురాలను ప్రజలు ఆనందోత్సహాల మధ్య జ రుపుకొన్నారు. అందులో భాగంగా సాయం త్రం వేల్పూర్‌లో నిర్వహించిన దసరా ఉత్స వాలలో కలెక్టర్‌ నారాయణరెడ్డితో కలిసి మం త్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొని ప్రజలంద రికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. వీడీసీ ఆధ్వర్యంలో రామాలయం నుంచి దేవతా మూర్తులను రథంపై ఉంచి నిర్వహించిన శో భాయాత్ర ద్వారా మంత్రి ప్రశాంత్‌రెడ్డి కలె క్టర్‌ నారాయణరెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు, జంబి హన్మాన్‌ ఆలయం వరకు చేరుకున్నారు.


వీడీసీ వారు అక్కడ ఏర్పాటు చేసి షమీ చెట్టుకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డి దంప తులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దసరా పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామశివారులో ఏర్పాటు చేసిన జంబి గద్దెల వద్దకు డప్పువాయిద్యాలతో వెళ్లి జమ్మిచెట్టుకు పూజలు చేసి ఒకరినొకరు షమీని పంచుకుంటూ శుభాకాంక్షలు తెలి యజేశారు. పడిగెల రామాలయం ఆవరణలో వీడీసీ ఆ ధ్వర్యంలో ఏర్పాటు రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఉత్సవాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-27T11:26:45+05:30 IST