భక్తి శ్రద్ధలతో దేవీ శోభాయాత్ర

ABN , First Publish Date - 2020-10-27T11:24:57+05:30 IST

నవరా త్రులు పూజలందుకున్న దేవిమాత విగ్రహాలు ని మజ్జనానికి తరలివెళ్లాయి. వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

భక్తి శ్రద్ధలతో దేవీ శోభాయాత్ర

నిజామాబాద్‌ కల్చరల్‌, అక్టోబరు 26: నవరా త్రులు పూజలందుకున్న దేవిమాత విగ్రహాలు ని మజ్జనానికి తరలివెళ్లాయి. వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం దేవిమాతలకు అంగరంగ వైభవంగా శోభాయాత్ర ను నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో ముందుకు సాగగా భజన పరులు భజనలు, యు వకుల నృత్యాలతో సాగింది. జిల్లా కేంద్రంలోని సా ర్వజనిక్‌ సమితి ముందుగా శోభాయాత్రను ప్రా రంభించగా అటు తర్వాత వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన దేవిమాతలు నిమజ్జనానికి తరలివెళ్లాయి. పలు ప్రాంతాల్లో దేవిమాతలు డప్పు వాయిద్యాల మధ్య సాగగా మరికొన్ని దేవిమాతలు లైటింగ్‌తో ఆర్భాటంగా సాగాయి. 

 

ముస్తాబైన రథాలపై.. 

దేవిమాత నిమజ్జనోత్సవంలో ప్రత్యేకంగా అలం కరించిన రథంపై అమ్మవారిని ఉంచి శోభాయాత్రను నిర్వహించారు. రథాన్ని పూలతో, భారీ లై టింగ్‌లో ఆకట్టుకునే విధంగా తయారుచేశారు. సి ర్నాపల్లి గడి సార్వజనిక్‌ సమితి గత పదేళ్లుగా నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు చేసి శోభాయాత్రను  నిర్వహించారు. సిర్నాపల్లి గడి వద్ద ప్రారంభమైన శోభాయాత్ర గండిమైసమ్మ, గోల్‌హనుమాన్‌, వీక్లీమార్కెట్‌, దేవిరోడ్‌, గంజ్‌, నెహ్రూ పార్కు మీదు గా సాగింది. మార్కండేయ మందిరంలో నెలకొల్పిన దేవిమాత ఆలయ శోభాయాత్ర మార్కండేయ మందిరం, పూలాంగ్‌ చౌరస్తా మీదుగా నిర్వహించారు. శోభాయాత్రలో సార్వజనిక్‌ సమితి అధ్యక్షుడు అంబెం సాయిలు, హరిదాసు, శ్రీహరి, శ్రీనివాస్‌, బస్వాపుర్‌ శంకర్‌, గిరిబాబు తదితర భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-27T11:24:57+05:30 IST