మాధవనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మంజూరు

ABN , First Publish Date - 2020-10-27T11:30:05+05:30 IST

నగర శివారులోని మాధవనగర్‌ వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మంజూరు అయింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మంజూరు చేసినట్లు భారత రైల్వే బోర్డు డైరెక్టర్‌ ఓ.ఎన్‌.శర్మ దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌కు లేఖ రాశారు.

మాధవనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మంజూరు

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 26: నగర శివారులోని మాధవనగర్‌ వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మంజూరు అయింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మంజూరు చేసినట్లు భారత రైల్వే బోర్డు డైరెక్టర్‌ ఓ.ఎన్‌.శర్మ దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌కు లేఖ రాశారు. ఈ మేరకు పార్లమెంట్‌ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ నాలుగు లైన్‌ల రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేశారు.దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి భారత రైల్వే శాఖ ఆమోధం తెలుపడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.


రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపైౖ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని పార్లమెంట్‌ సభ్యుడయ్యాక ఫైలును మినిస్ట్రి ఆఫ్‌ రైల్వేస్‌కు తీసుకెళ్లగా వారు సంసిద్ధత తెలిపి రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా తన  ఆమోదం తెలుపాలని సూచించారని తెలిపారు. సెప్టెంబరులో జరిగిన దిశ సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఈ విషయంలో తీవ్రంగా మందలించగా మూడు రోజులకే ఆ శాఖ నుంచి నివేదికలు వెళ్లి ఎట్టకేలకు  రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మంజూరయిందన్నారు. నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనదారులు, అంబులెన్సులు గంటల తరబడి రైల్వే గేట్‌ పడితే నిరీక్షించాల్సిన పరిస్థితి ఉందని యేడాది లోగా రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని పూర్తిచేసి ఇబ్బందులను తొలగించేందుకు కృషిచేస్తానన్నారు. 

Updated Date - 2020-10-27T11:30:05+05:30 IST