Abn logo
Sep 26 2020 @ 02:39AM

బీర్కూర్‌లో రైతు ఆత్మహత్య

బీర్కూర్‌, సెప్టెంబరు 25: మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన పాడి రైతు నెల్లూరి సాయిలు(59) శుక్రవారం తన పాత ఇం టివద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్‌ఐ సతీష్‌ వర్మ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం... సాయిలు గత కొన్నేళ్లుగా గేదెలను కొనుగోలు చేసి పాలు, పెరుగు విక్రయిస్తూ ఉపాధి పొందు తున్నారు.


ఇదే క్రమంలో మరో రెండు గేదెలను కొనుగోలు చేద్దామని భార్య, పిల్లలతో తెలుపగా వారు విభేదించారు. వారితో గొడవపడి కోపంగా బయటకు వెళ్లిపోయాడు. అనంతరం పాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య విఠబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement
Advertisement