Advertisement
Advertisement
Abn logo
Advertisement

అవునా..? America పర్యటనలో Modi ని NewYork Times పత్రిక పొగడ్తలతో ఆకాశానికెత్తేసిందా..? అసలు నిజం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ‘భూమాతకు చివరి ఆశాకిరణం.. మనల్ని ఆశీర్వదించేందుకు వచ్చారు’ అనే శీర్షికతో  ప్రముఖ వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్ భారత ప్రధాని గురించి ఓ వార్త ప్రచురించిందనేది దీని సారాంశం. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. కొందరు నెటిజన్లు మాత్రం ఇది అబద్ధమంటూ ఆధారాలతో సహా నిరూపించారు. ఈ వార్తలో వాడిన మోదీ ఫొటో ఆయన అధికారిక వెబ్‌సైట్‌లోనిదని వారు చెబుతున్నారు. ఇక ఆర్టికల్‌లో వాడిన భాష, వాక్య నిర్మాణం.. న్యూయార్క్ టైమ్స్ స్థాయికి తగినవి కావని, ఇంగ్లిష్‌పై పట్టున్న వారెవరైనా సరే ఈ విషయాన్ని ఇట్టే గుర్తించగలరని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా.. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన అసలు వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేస్తున్నారు. 

దీనిపై అమెరికాలోని ఎన్నారైలు కూడా మండిపడుతున్నారు. ‘‘ప్రధాని మోదీ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కొందరు ఇలా విఫలయత్నం చేస్తుండటం దురదృష్టకరం. మోదీ సారథ్యంలో భారత్ సాధించిన విజయాలను, అభ్యున్నతిని తక్కువ చేసి చూపేందుకే ఇలా చేస్తున్నారు. అయితే.. మోదీని తప్పు పట్టే అవకాశం లేకపోవడంతో కొందరు ఇటువంటి అడ్డదారులు తొక్కుతున్నట్టు ఈ ఘటన నిరూపిస్తోంది’’ అని ఓ ఎన్నారై వ్యాఖ్యానించారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement