వ్యాక్సిన్ పాస్‌పోర్టు తప్పనిసరి చేసే యోచనలో న్యూయార్క్!

ABN , First Publish Date - 2021-08-04T10:28:48+05:30 IST

అగ్రరాజ్యంలోని ప్రధాన నగరాల్లో ముఖ్యమైన న్యూయార్క్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక్కడ వ్యాక్సిన్ పాస్‌పోర్టులను

వ్యాక్సిన్ పాస్‌పోర్టు తప్పనిసరి చేసే యోచనలో న్యూయార్క్!

న్యూయార్క్: అగ్రరాజ్యంలోని ప్రధాన నగరాల్లో ముఖ్యమైన న్యూయార్క్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక్కడ వ్యాక్సిన్ పాస్‌పోర్టులను తప్పనిసరి చేయాలని న్యూయార్క్ మేయర్ డి బ్లాసియో ఆలోచిస్తున్నారట. ఈ పాలసీ ఆగస్టు 16 న ప్రారంభమవుతుందని బ్లాసియో వెల్లడించారు. అయితే సెప్టెంబరు 13 నుంచి ఈ నిబంధన పూర్తిగా అమల్లోకి వస్తుందట. ఈ నిబంధన అమల్లోకి వచ్చినప్పటి నుంచి రెస్టారెంట్లు, జిమ్ములు తదితర సదుపాయాలు ఉపయోగించుకోవాలన్నా, ప్రదర్శనలు, ప్రోగ్రాములకు హాజరవ్వాలన్నా కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ అయినా వేసుకున్నట్లు ఆధారం చూపించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ కార్డులో లేదంటే ఎక్సెల్సియోర్ వంటి వ్యాక్సినేషన్ యాప్స్‌ ఉన్నా పర్లేదని బ్లాసియో తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో డెల్టా కేసులు పెరుగుతున్న తరుణంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ పాస్‌పోర్టు నిబంధన అమలు చేయడం చాలా కష్టమని, దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని న్యూయార్క్‌లోని రెస్టారెంట్ల యజమానులు వాపోతున్నారు. కాగా, ఇప్పటికి న్యూయార్క్‌లో 66శాతం పెద్దవాళ్లంతా వ్యాక్సిన్ తీసుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.

Updated Date - 2021-08-04T10:28:48+05:30 IST