కన్న కూతురిని రోడ్డుపై వదిలేసిన తల్లి.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-05-22T02:45:34+05:30 IST

కన్న కూతురిని రోడ్డుపై వదిలేసిన తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని

కన్న కూతురిని రోడ్డుపై వదిలేసిన తల్లి.. అమెరికాలో..

న్యూయార్క్: కన్న కూతురిని రోడ్డుపై వదిలేసిన తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాట్రిస్ చాంబర్స్(29) అనే మహిళ న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ స్ట్రీట్ ప్రాంతంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో తన కూతురిని కారు నుంచి దించేసింది. అనంతరం కూతురి వస్తువులున్న బ్యాగును విసిరేసి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లిపోయింది. స్థానికులు ఆరేళ్ల పాపకు భోజనం పెట్టి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు పాప తల్లి, ఆమె బాయ్ ఫ్రెండ్‌పై వివిధ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పాపను కారు దించేసిన ప్రాంతంలోనే పాప అసలు తండ్రి నివాసముందని.. ఈ కారణంగానే ఆ ప్రాంతంలో దించేసి ఉంటారని పోలీసులు తెలిపారు. పాప తండ్రి డబ్బులు ఇవ్వనందుకే పాట్రిస్, తన బాయ్ ఫ్రెండ్ ఇలా చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. ఈ కేసుకు సంబంధించిన తీర్పును కోర్టు ఆగస్ట్‌లో ఇవ్వనుంది. ఒకవేళ వీరిద్దరూ చేసిన నేరం రుజువైతే నాలుగేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

Updated Date - 2020-05-22T02:45:34+05:30 IST