Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్‌ఎక్స్‌టీ డిజిటల్ షేర్లు... 15 శాతం, టీఏఎల్ షేర్లు 19 % పెరిగాయి...

హైదరాబాద్ : ఎన్‌ఎక్స్‌టీ డిజిటల్ షేర్లు ఈ రోజు అదరగొట్టాయి. లహీనమైన మార్కెట్‌లో శుక్రవారం ఇంట్రా-డేలో ఎన్‌ఎక్స్‌టీ డిజిటల్ షేర్లు దాదాపు 19 శాతం పెరిగి, రూ. 509.80 కి చేరాయి. ఎన్‌ఎక్స్‌టీ డిజిటల్ తన హక్కుల ఇష్యూ 1.94 రెట్లు, లేదా 194 శాతం సబ్‌స్క్రైబ్ అయినట్లుగా  ప్రకటించిన తర్వాత... గత రెండు ట్రేడింగ్ రోజుల్లో, హిందూజా గ్రూప్ కంపెనీ స్టాక్ 40 శాతం జూమ్ అయింది.  ఇష్యూ పరిమాణం రూ. 288.61 కోట్లు కాగా... కంపెనీ రూ. 560.13 కోట్లు పొందింది. ఈ ఏడాది జనవరి 11 న... షేరు ధర 52 వారాల గరిష్ట స్థాయి రూ. 569.94 కు చేరుకుంది.


ఎన్‌ఎక్స్‌టీ డిజిటల్... గ్లోబల్ హిందూజా గ్రూప్ మీడియా వర్టికల్. మీడియా, కమ్యూనికేషన్స్ కంపెనీ డిజిటల్ కేబుల్, శాటిలైట్(హెచ్‌టీఎస్), బ్రాడ్‌బ్యాండ్, కంటెంట్ సిండికేషన్, టెలిషాపింగ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతదేశపు ప్రీమియర్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల కంపెనీ. యాజమాన్యం ప్రకారం, కంపెనీ నాన్-కోర్ ఆస్తులను లిక్విడేట్ చేయడానికి, తద్వారా తన రుణాన్ని తీర్చడానికవసరమైన చర్యలను  తీసుకుంటోంది. దాని బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారంలో గణనీయమైన వృద్ధిని కొనసాగిస్తోంది. అలాగే ఎన్‌ఎక్స్‌టీ డిజిటల్ భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ పీఏఏఏఎస్ ప్లాట్‌ఫారమ్‌గా అవతరించడానికి అనుమతులను పొందిన హచ్‌ఐటీఎస్ లో ఇతర మల్టీ-సిస్టమ్ ఆపరేటర్లతో)ఎంఎస్‌ఓలు) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరింగ్ మోడల్‌ను కూడా అమలు చేస్తోంది. 

Advertisement
Advertisement