నూజివీడులో కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-03T09:48:46+05:30 IST

నూజివీడు పట్టణంలో క్రమం తప్పకుండా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తునే ఉన్నాయి.

నూజివీడులో కరోనా కేసులు

గోప్యంగా ఉంచిన అధికారులు 


నూజివీడు, జూన్‌ 2 : నూజివీడు పట్టణంలో క్రమం తప్పకుండా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తునే ఉన్నాయి. మంగళవారం మరో కేసు వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో స్వచ్ఛందంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్న వ్యక్తి రక్త సంబంఽధీకునికే కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు ఆ గృహాన్ని సందర్శించి, ఆ వ్యక్తిని పరీక్షల నిమిత్తం తరలించి, ఆ కుటుంబాన్ని హౌస్‌ క్వారంటైన్‌లో ఉంచినట్లు సమాచారం. అనుమానితుల్దిరూ రెండు రోజుల క్రితం ఇటీవల విజయవాడలో బంధువు అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు వారం రోజుల నుంచి కరోనా కేసుల గురించి స్పష్టమైన వివరాలు ఇవ్వడం లేదు. అధికారికంగా ధ్రువీకరించడం లేదు.

Updated Date - 2020-06-03T09:48:46+05:30 IST