మూడు కాళ్లతో శిశువు జననం

ABN , First Publish Date - 2021-03-05T15:23:05+05:30 IST

నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో..

మూడు కాళ్లతో శిశువు జననం

నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గురువారం ఓ మహిళ మూడు కాళ్ల శిశువుకు జన్మనిచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నరేంద్రసింగ్‌ సాధారణ కాన్పు చేసేందుకు కష్టం అవుతుందని గుర్తించి, ఆమె బంధువుల అంగీకారంతో సిజేరియన్‌ చేశారు. ఆమె నడుంపై కాలు ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. ఇటువంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని, మేనరికం సంబంధం వల్ల జన్యుపరమైన లోపాలతో ఇటువంటి శిశువులు జన్మిస్తారని డాక్టర్‌ తెలిపారు. మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఈ శిశువును విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపిస్తున్నట్టు తెలిపారు. ఈ శిశువుకు శస్త్రచికిత్స చేసి వీపుపై ఉన్న కాలును తొలగించవచ్చని వైద్యులు తెలిపారు. శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్పారు.

- నూజివీడు రూరల్‌

Updated Date - 2021-03-05T15:23:05+05:30 IST