Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 16 May 2022 13:34:23 IST

‘స్టార్ మా’ లో సరికొత్త సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’

twitter-iconwatsapp-iconfb-icon

ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందించడంలో ‘స్టార్ మా’ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఈ ఛానల్ ప్రత్యేకత ఏమిటంటే.. ప్రేక్షక వీక్షకులకు మంచి అనుభూతిని అందించేందుకు  సరికొత్త కథాంశాలతో చక్కటి సీరియల్స్‌ను సిద్ధం చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు  మరో కొత్త తరహా కథ తో ‘స్టార్ మా’ ఓ సరికొత్త సీరియల్ ని అందించడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ కొత్త సీరియల్ పేరు "నువ్వు నేను ప్రేమ". ఈరోజు (సోమవారం) సాయంత్రం 06.30 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం కాబోతోంది. ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఇందులో కేవలం ప్రేమ మాత్రమే కాదు. రెండు కుటుంబాలు, బంధాలు, మమతానురాగాలు, బాధ్యతలు అన్నీ కలిసిన అందమైన కుటుంబ కథ.


 


ఫామిలీ లో అందరికీ కావాల్సిన ఎమోషన్స్, సెంటిమెంట్స్ అన్నిటినీ ఈ సీరియల్ అందిస్తుంది. ఒకరిని ఒకరు చూసుకోడానికి కూడా ఇష్టపడని ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలవుతుంది? తరవాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ?.. లాంటి ప్రశ్నలకు సమాధానం ఈ సీరియల్ "నువ్వు నేను ప్రేమ". ఇష్టపడే ఛాన్స్ లేని ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడమే ఈ సీరియల్ లో కొత్త విషయం. అందుకే "నువ్వు నేను ప్రేమ" ని తప్పకుండా చూడండి. నిన్న మొన్నటి వరకూ ప్రేక్షకుల్ని అలరించిన ‘చెల్లెలి కాపురం’ సీరియల్ ఇటీవల ముగిసింది. దాని స్థానంలో అదే టైమ్ కు ‘నువ్వు నేను ప్రేమ’ సీరియల్ ప్రసారం కానుంది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement