తల్లిదండ్రుల తీరు మారాలి

ABN , First Publish Date - 2021-02-26T04:24:47+05:30 IST

పిల్లలను పెంచే విధానంలో తల్లిదం డ్రుల తీరు మారాలని మహిళా కమిషన్‌ రాష్ట్ర సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి అన్నారు.

తల్లిదండ్రుల తీరు మారాలి
సిద్ధాపురంలో విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్న రాజ్యలక్ష్మి

రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు రాజ్యలక్ష్మి


ఆకివీడు / రూరల్‌, ఫిబ్రవరి 25: పిల్లలను పెంచే విధానంలో తల్లిదం డ్రుల తీరు మారాలని మహిళా కమిషన్‌ రాష్ట్ర సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి అన్నారు. సిద్ధాపురం, దుంపగడప గ్రామాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఆదర్శ క్లబ్‌ ఆధ్వర్యంలో గురువారం పౌష్టికాహారాన్ని అందజే శారు. ఆడపిల్లలతో పాటు, మగ పిల్లలకు నైతిక విలువలు, కుటుంబ వ్యవహారాలు, ఆచార సంప్రదాయాలు నేర్పాలన్నారు. యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలే తప్ప, జీవితాలను నాశనం చేసుకో కూడదన్నారు. లయన్స్‌క్లబ్‌ సభ్యులు నేరెళ్ళ రామచెంచయ్య, గొంట్లా కృష్ణ మూర్తి, వోలేటి శ్రీనివాసరావు, బలే వెంకటేశ్వరరావు, బలరామ్‌ ప్రతాప్‌ కుమార్‌, అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.


ఆకివీడు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె పరిశీలించారు. విద్యార్థులకు సమాజంలో ఎదురవుతున్న సమస్యలపై అవగాహన కల్పించారు. సమాజంలో మహిళలు, యువతలపై అరాచకాలను ధైర్యంతో ఎదుర్కొవాలన్నారు. పాఠశాల దారిలో యువకులు వేధిస్తున్నారని విద్యార్థినులు ఆమె దృష్టికి తీసుకెళ్ళడంతో ఎస్‌ఐ వీరభద్రరావుకు సమాచారం ఇచ్చారు. కార్యక్రమంలో అప్పిరెడ్డి, చెంచయ్య, కృష్ణమూర్తి, ప్రతాప్‌కుమార్‌, సత్యనారాయణ, వెంకన్నబాబు, గోపాలకృష్ణ, పాఠశాల హెచ్‌ఎం కాకర్ల రాజరాజేశ్వరి తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-02-26T04:24:47+05:30 IST