చవకగా దొరికే క్యాబేజీ తింటే ఇన్ని ఉపయోగాలా!

ABN , First Publish Date - 2022-02-18T18:16:13+05:30 IST

చౌకధరల్లో యేడాది పొడవునా లభించే కూరల్లో క్యాబేజీ ఒకటి. తాజా క్యాబేజీని పచ్చిగా కానీ, ఉడికించిగానీ తినవచ్చు. అతిగా ఉడక్కుండా ఉండాలంటే క్యాబేజీని వండేటప్పుడు సన్నసెగ మీద వండాలి. క్యాబేజీ అతిగా ఉడికినప్పుడు వచ్చే దుర్వాస వల్లే చాలా మంది

చవకగా దొరికే క్యాబేజీ తింటే ఇన్ని ఉపయోగాలా!

ఆంధ్రజ్యోతి(18-02-2022)

ప్రశ్న: రంగు రంగుల క్యాబేజీల్లో ఉండే పోషక విలువలు తెలియచేయండి. 


- రాజేశ్‌, అవనిగడ్డ


డాక్టర్ సమాధానం: చౌకధరల్లో యేడాది పొడవునా లభించే కూరల్లో క్యాబేజీ ఒకటి. తాజా క్యాబేజీని పచ్చిగా కానీ, ఉడికించిగానీ తినవచ్చు. అతిగా ఉడక్కుండా ఉండాలంటే క్యాబేజీని వండేటప్పుడు సన్నసెగ మీద వండాలి. క్యాబేజీ అతిగా ఉడికినప్పుడు వచ్చే దుర్వాస వల్లే చాలా మంది ఈ కూరను ఇష్టపడరు. అరకప్పు ఉడికిన క్యాబేజీ (సుమారు 75గ్రా) కేవలం 20 కెలొరీలనే ఇస్తుంది. వందగ్రాముల పచ్చిక్యాబేజీ ఒక రోజుకు అవసరమయ్యే విటమిన్‌- సి లో సగాన్ని, పీచుపదార్థాలలో 10 శాతాన్ని అందిస్తుంది. ఈ పీచుపదార్థాలు మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి.  క్యాబేజీలో లభించే యాంటీఆక్సిడెంట్లు గుండెఆరోగ్యానికి సహాయపడతాయి. ఈ కూర రోగనిరోధకశక్తిని పెంచేందుకు ఉపకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ - కె గాయాల వద్ద రక్తం వేగంగా గడ్డకట్టేందుకు సహాయపడుతుంది. క్యాబేజీలో ఉండే ఇండోల్‌-3- కార్బినాల్‌ అనే రసాయనం యాంటీఆక్సిడెంటుగానూ, క్యాన్సర్‌ నిరోధక ఏజంటుగానూ పనిచేస్తుంది. రొమ్ము, కాలేయం ప్రొస్టేట్‌, ఊపిరితిత్తులు, పెద్ద ప్రేవుల కాన్సర్‌ నివారణలో ఈ రసాయనం కీలక పాత్ర పోషిస్తుంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-02-18T18:16:13+05:30 IST