జంక్‌ఫుడ్‌.. జరభద్రం

ABN , First Publish Date - 2022-08-12T17:21:54+05:30 IST

స్కూళ్లు తెరిచేశారు. ఇక రోజూ హడావిడే... వారికి లంచ్‌ బాక్సులు మీరే కడుతున్నారా... పోషకాలు లేకుండా

జంక్‌ఫుడ్‌.. జరభద్రం

ఆరోగ్యానికి మంచిది కాదు 

లంచ్‌ బాక్సులో పోషకాలతో నిండిన ఆహారమే మేలు


స్కూళ్లు తెరిచేశారు. ఇక రోజూ హడావిడే... వారికి లంచ్‌ బాక్సులు మీరే కడుతున్నారా... పోషకాలు లేకుండా జంక్‌ఫుడ్‌ కడుతున్నారా... గమనించండి. ఎదిగే పిల్లలకు పోషకాలతో ఉండే ఆహారం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. పిల్లలకు జ్ఞాపక శక్తితో పాటు ఆరోగ్యంపై ప్రభావం చూపే జంక్‌ఫుడ్‌ను దూరం చేయండని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు. పిల్లల లంచ్‌ బాక్సులో ఏం ఉండాలి ఏం ఉండకూడదనే విషయాలపై నిపునులు సూచనలు తప్పనిసరి. 


పాఠశాలలు ప్రారంభమైయ్యాయి. పిల్లలు రోజూ లంచ్‌ బాక్సులు తీసుకొని వెళ్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అనారోగ్యాన్ని ఇచ్చి పంపిస్తున్నారు. మీరు ఆశ్చర్యపోయినా ఇది మాత్రం నిజం. జాతీయ పోషకాహార సంస్థ చేపట్టిన పరిశీలనలోకి వచ్చాయి. పిల్లలు తీసుకుని వెళ్లే ఆహారంలో మార్పుతోనే బరువు సమస్య ఉత్పన్నమవుతుందని నిర్ధారించారు. గతేడాదితో పోలిస్తే పిల్లలందరూ ఇప్పుడు జంక్‌ఫుడ్‌నే తీసుకువెళ్తున్నారు. అన్నం, ఊరగాయలు, ఆకు కూరలు, పండ్లు, గుడ్లు వంటి ఆహార పదార్థాలు లంచ్‌బాక్సులో కనుమరుగవుతున్నాయి. తల్లిదండ్రులు ఉద్యోగులు కావడం దీనికి కారణం. దీంతో లంచ్‌ బాక్సుల్లో సమోసాలు, న్యూడిల్స్‌, చిప్స్‌, పిజ్జా ముక్కలు, ఫ్రైడ్‌రైస్‌ పదార్థాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 


పరిశోధకులు ఎమంటున్నారంటే..

సరైన పోషకాలులేని సరిపడా కేలరీలు లేని ఆహార పదార్థాలను జంక్‌ ఫుడ్స్‌ అంటారు. జంక్‌ఫుడ్స్‌తో ఉబకాయంతో పాటు మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు, వగైరా ఆహార పదార్థాలు తినేవారిలో మతిమరుపు సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఆస్ర్టేలియా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కొవ్వు అధికంగా చక్కెర, ఉప్పు అధిక కేలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే అది మెదడుపై ప్రభావం చూపుతుందని వారు హెచ్చరిస్తున్నారు. 


విరామ సమయాల్లో...

స్కూల్‌ విరామ సమయాల్లో కూడా చాలా మంది పిల్లలు ఇదే తరహా ఆహారం తీసుకుంటున్నారు. ఇంట్లో స్నాక్స్‌ను ప్రిపేర్‌ చేస్తుండగా, మరి కొంతమంది పిల్లలు ఇంటి నుంచి తీసుకొని వెళ్లి డబ్బులతో చిప్స్‌ శాండ్‌విచ్‌లు మొదలైన ఆహార పదార్థాలను తింటున్నారు. వీటిలో 82 శాతం కొవ్వు ఉంటుంది. ఇడ్లీ, ఉతప్ప, పరోటా వంటివి పెడుతున్నారు. నగరంలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే వారిలో 10 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారనే సమాచారం. ఎనిమిది గంటలకే కొన్ని పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. దీంతో వంటచేసే సమయం లేక ఫాస్ట్‌ఫుడ్‌ని ఆశ్రయిస్తున్నారు. 


క్యాలరీలు ఎమంటున్నాయంటే..

పిల్లల వారి వయస్సు, చురుకుదనం బట్టి కేలరీలు అవసరమవుతాయి. బడికి వెళ్లే చిన్నారులకు రోజూ సుమారు 1000 నుంచి 2,400 కేలరీలు అవసరమవుతాయి. ఎదుగుదలకు వచ్చాక బాలికలకు అదనంగా 200 కేలరీలు బాలురకు 500 కేలరీలు అవసరం. 


వెంటాడే సమస్యలు..

పిల్లలకు ఇష్టమని వారికి ఇష్టమైన పదార్థాలు పెట్టడంతో ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నారు. సమయాభావం పేరుతో ఫుడ్స్‌ పెట్టడంవల్ల అనారోగ్య సమస్యలకు స్వాగతం పలుకుతున్నారు. అన్నం, కూరలు వండాలంటే సమయం తీసుకుంటుంది. అందుకే న్యూడిల్స, శాండ్‌విచ్‌లు వంటి ఫుడ్స్‌ షాపుల్లో రెడీ చేసి పెట్టవచ్చనే ఉద్దేశంతో ఇలా అలవాటు చేస్తున్నారు. అందుకే పిల్లల్లో ఊబకాయం తలెత్తుతున్నాయి. అందుకు తల్లిదండ్రులు పిల్లలకు లంచ్‌ బ్యాక్లుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


పోషకాహారమే మేలు..

చిన్నతనం నుంచే పిల్లల శరీరానికి పోషకాహారం అందించాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతిరోజూ ఏడు గ్రూపులు శక్తి అందకపోతే వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది. ఫలితంగా వారిలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే చిన్నారులకు రోజూ ఆకు కూరలు, క్యారెట్‌, బీట్‌రూట్‌ వంటివి అందించాలి. ఎందుకంటే స్కూలులో వారికి కంటి చూపుతో ఎక్కువ పనులు చేయాల్సి ఉంటుంది. అందుకే వారికి ఆకు కూరలు ఇవ్వాలి. చదవడం, ఆడడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. అందువల్ల కేలరీలు లభించే ఆహారపదార్థాలు అందించడంతో నీరసపోయిన వారు వారంలో నాలుగైదు రోజులు గుడ్డు అందించాలి. 16 ఏళ్ల వరకు వారికి జంక్‌ఫుడ్‌ అందించకూడదు. అందువల్ల వారికి 40 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.


ప్లాస్టిక్‌ బాక్సులు వద్ద..

  • ఆహారం తాజాగా ఉండే మెటీరియల్‌ను ఎంచుకోవాలి. 
  • లోపల ఎక్కువ భాగాలు ఉండే విధంగా ఎంపిక చేసుకోవాలి. 
  • ప్రతీ భాగం శుభ్రపరిచేలా చూడాలి. లేదంటే బాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. 
  • పెద్ద సైజు బాక్స్‌ కానిది, చిన్న సైజు కానిది ఎంపిక చేసుకోవాలి. 
  • ప్లాస్టిక్‌ బాక్సులు వాడొద్దు... వేడి వస్తువులు బాక్సుల్లో పెడితే ఆ వేడికి రసాయనాలు ఆహారంలో కలిసి... కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో వెల్లడైంది. 

(నార్సింగ్‌ - ఆంధ్రజ్యోతి)

Updated Date - 2022-08-12T17:21:54+05:30 IST