నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-08-08T05:33:53+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని ఏపీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ యూనియన్‌ జేఏసీ చైర్మన్‌ నాగేశ్వర రావు డిమాండ్‌ చేశారు.

నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలి
మాట్లాడుతున్న జేఏసీ చైర్మన్‌ నాగేశ్వరరావు

 జేఏసీ చైర్మన్‌ నాగేశ్వరరావు


నెల్లూరు (వైద్యం), ఆగస్టు 7 : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని ఏపీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ యూనియన్‌ జేఏసీ చైర్మన్‌ నాగేశ్వర రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం నెల్లూరులోని డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో కార్మిక చట్టాలు సవరణ - కార్మికులపై ప్రభావం అన్న అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వర రావు మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నూతనంగా తీసుకు వచ్చిన 4 లేబర్‌ కోడ్‌ల వల్ల కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలు రద్దవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ యజమానులకు మేలు జరిగేలా ఈ నూతన చట్టాలను తీసుకువచ్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నూతన చట్టాలను అమలు చేసేందుకు సిద్ధమైందని, తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఏపీ జెన్‌కో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 8వ తేదీన జనజాగరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు మోహన్‌రావు, శ్రీనివాసులు, పెంచల నర్సయ్య, అన్నపూర్ణమ్మ, కట్టా సుబ్రహ్మణ్యం, గడ్డం అంకయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-08T05:33:53+05:30 IST