పెళ్లి సంగతి తేల్చకుండానే... బిడ్డతో కెమెరాకు ఫోజిచ్చిన BENGALI BEAUTY

టీఎంసీ పార్టీ తరుఫున ఎంపీగా గెలిచిన గార్జియస్ పొలిటీషన్, బెంగాలీ నటి... నుస్రత్ జహాన్... దీపావళి సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చింది. ఆమె తన బిడ్డతో కలసి తొలిసారి కెమెరా ముందుకొచ్చింది. అంతే కాదు, మరో ఫోటోలో నటుడు యశ్ దాస్‌గుప్తతో కలసి దీపాల కాంతుల్లో కనువిందు చేసింది. ‘హ్యాపీ దివాలీ ఫ్రమ్ అస్’ అంటూ తన ఫెస్టివల్ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది...

బెంగాల్లీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నుస్రత్ జహాన్ కేవలం నటన, గ్లామర్‌తోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన స్టైల్లో సెన్సేషన్ సృష్టించింది. అయితే, గత కొన్నాళ్లుగా ఆమె పర్సనల్ లైఫ్ పలుమార్లు వార్తల్లో నిలిచింది. మొదట నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను టర్కీలో పెళ్లాడానని చెప్పిన ఆమె ఇండియాలో అది చెల్లదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమది కేవలం సహ  జీవనం మాత్రమేనంటూ బాంబు పేల్చింది. అయితే, గత నెల రోజులుగా బెంగాలీ నటుడు యశ్‌దాస్ గుప్తాను నుస్రత్ జహాన్ పెళ్లాడిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటి గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వని కోల్‌కోతా బ్యూటీ డైరెక్ట్‌గా దీపావళి వేళ ఫోటోలు షేర్ చేసింది. కొడుకుతో కలసి తొలిసారి అభిమానుల ముందకొచ్చిన అందాల పొలిటీషన్ రెండో ఫోటోలో యశ్‌దాస్ గుప్తతో కలసి కనిపించింది. అందులో ఆమె నుదుటన సింధూరం పెట్టుకుని దర్శనం ఇవ్వటంతో ఇంతకాలంగా వినిపిస్తోన్న పుకార్లను బలపరిచినట్టు అయింది. అయితే, నుస్రత్ మాత్రం ఇంకా తన పెళ్లిని అధికారికంగా ఒప్పుకోవటం లేదు...

Advertisement