టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్,నిఖిల్ జైన్‌ల వివాహం చెల్లదు

ABN , First Publish Date - 2021-11-18T13:30:07+05:30 IST

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాలీ నటి నుస్రత్‌ జహాన్‌,నిఖిల్‌ జైన్‌ల పెళ్లి చట్టబద్ధంగా చెల్లదని కోల్‌కతా కోర్టు ప్రకటించింది....

టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్,నిఖిల్ జైన్‌ల వివాహం చెల్లదు

కోల్‌కతా కోర్టు సంచలన ఉత్తర్వులు

కోల్‌కతా(పశ్చిమబెంగాల్): తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాలీ నటి నుస్రత్‌ జహాన్‌,నిఖిల్‌ జైన్‌ల పెళ్లి చట్టబద్ధంగా చెల్లదని కోల్‌కతా కోర్టు ప్రకటించింది. అంతకుముందు టీఎంసీ ఎంపీ నుస్రత్ కూడా నిఖిల్‌తో తన వివాహం టర్కీ చట్టం ప్రకారం జరిగిందని, అందువల్ల భారతదేశంలో చెల్లుబాటు కాదని ప్రకటించారు.తన నిధులు దుర్వినియోగం అయ్యాయని నుస్రత్ ఆరోపించారు.భారతదేశంలో తమ వివాహం చెల్లదని నుస్రత్ జహాన్ పేర్కొన్న తర్వాత, పెళ్లిని రిజిస్టర్ చేయమని పలుసార్లు తాను నుస్రత్‌ను అభ్యర్థించానని, అయితే ఆమె తన అభ్యర్థనలన్నింటినీ తప్పించిందని నిఖిల్ పేర్కొన్నాడు.


కాగా గత సంవత్సరం నవంబరు నుంచి తాము విడిపోయామని నిఖిల్ జైన్ చెప్పారు.నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ కొంతకాలం డేటింగ్ తర్వాత  2019జూన్ 19న పెళ్లి చేసుకున్నారు. వారు టర్కీలో ఒక వేడుకలో వివాహం చేసుకున్నారు. తర్వాత కోల్‌కతాలో వివాహ రిసెప్షన్‌ నిర్వహించారు.మరో వైపు విడిపోయాక 2021 ఆగస్ట్ 26వతేదీన నుస్రత్ జహాన్ యిషాన్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది.నుస్రత్ కుమారుడు ఇషాన్ జనన ధృవీకరణ పత్రంలో యష్ దాస్‌గుప్తా పేరును తండ్రిగా చేర్చింది.  


Updated Date - 2021-11-18T13:30:07+05:30 IST