నర్సరీ సంచుల కొను‘గోల్‌మాల్‌’

ABN , First Publish Date - 2022-01-20T04:16:08+05:30 IST

జిల్లా గ్రామీణ ప్రాం తాల అభివృద్ధి సంస్థలో నిధుల గోల్‌మాల్‌ మరోసారి తేట తెల్లమైంది.

నర్సరీ సంచుల కొను‘గోల్‌మాల్‌’
బోరు వేస్తున్న దృశ్యం

టెండర్లు లేకుండా ప్లాస్టిక్‌ బ్యాగుల కొనుగోలు..

కొత్తగూడెం టౌన్‌, జనవరి 19: జిల్లా గ్రామీణ ప్రాం తాల అభివృద్ధి సంస్థలో నిధుల గోల్‌మాల్‌ మరోసారి తేట తెల్లమైంది. పల్లెప్రగతిలో భాగంగా మొక్కల పెంపకం కోసం చేపట్టిన నర్సరీ నిర్వహణలో కొందరు అధికారులు అడుగడుగునా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వి నిపిస్తున్నాయి. నర్సరీలో మొక్కల ఎదుగుదలకు వినియో గించే బ్యాగుల కొనుగోలు కోసం టెండర్లు పిలవకుండానే ఇష్టారీతిన కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ప్లాస్టిక్‌ బ్యాగుల సరఫరా మొత్తం టెండర్లలో కోట్‌ చేసుకున్న వ్యక్తికి ఇవ్వాల్సి ఉండగా టెండర్లు లేకుండా అధికారులు తమకు నచ్చిన మూడు ఏజెన్సీదారులకు ఇవ్వడం కూడా పలు అనుమానాలకు తావి స్తోంది. పల్లెప్రగతి పార్కుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేయడం, మోటర్లు బిగించారనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని 481 గ్రామపం చాయతీల్లోని నర్సరీలో 80లక్షల మొక్కలు పెంచేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. నర్సరీల్లో మొక్కల ఎదుగుదలకు 275ప్లాస్టిక్‌ కవర్లతో కేజీ ప్యాకెట్‌లో లభించే విధంగా ఒక కేజీ ప్యాకెట్‌కు రూ.158ల చొప్పున మొత్తం 33,455కేజీల బ్యాగులను పంపిణీ చేశారు. ఈ బ్యాగుల కొ నుగోలుకు రూ. 52లక్షల 85వేల 818లను ఖర్చు చేశారు. వీటితోపాటు జిల్లాలోని 22 మండలాల్లో 22బోర్లు, మో టర్లును టెండర్‌ లేకుండానే కేటాయించారని, వీటిల్లో ఇప్ప టికే 15బోర్లు వేసి మోటర్లు బిగించారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ టెండరు పిలిస్తే ఒకటే టెండరు యావత్‌ జిల్లా అంతటా ఒకే కాం ట్రాక్టర్‌కు కేటాయించాలి. అటవీ శాఖ టెండర్లు ఆహ్వానిం చిందని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రొసీడింగ్‌ కాపీల ను జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయం నుంచి జారీచే యడం గమనార్హం. జిల్లాలో ఏకీకృత టెండర్‌ ఇవ్వకుండా 5,6 మండలాలకు ఒక ఏజెన్సీకి టెండర్‌ కేటాయించడం ప లు అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలోని ఒక్కోక్క గ్రామ పంచాయతీకి 15నుంచి 16వేల మొక్కలు పెంచా లని ఆదే శాలు జారీచేశారు. టెండర్‌ ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం ఏమిటిని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ సెక్షన్‌ నుంచి చేయాల్సిన పే మెంట్‌ మండలాల నుంచి చేయడంపై ఏంపీడీవోలు నిర సన వ్యక్తం చేస్తున్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం నుంచి టెండర్‌ కేటాయించిన వారే పేమెంట్‌ చే యాల్సి ఉండగా కిందిస్థాయి అధికారులతో పేమెంట్‌ చే యడంతో విషయం బహిర్గత మైంది. జిల్లాలో ఏ మం డలాల్లోని ఏ గ్రామ పంచాయతీలో ఎన్ని మొక్కలు నాటి సంరక్షించాలో దిశానిర్ధేశం చేస్తున్నారు. అటవీ ప్రాంతా లైన భద్రాచంలం, చర్ల, వెంకటాపురం, ఇల్లెందు, ఆళ్లపల్లి, గుండాల, అశ్వాపురం, దుమ్ముగూడెం, దమ్మపేట, కరక గూడెం, మణుగూరు, ములకలపల్లి, టేకులపల్లి మండ లాల్లో జిల్లా అధికారులు నిర్ణయించి మొక్కలు, ఎరువులు, ప్లాస్టిక్‌ సంచులను గ్రామ పంచాయతీ నర్సరీలకు పంపిస్తున్నారు. జిల్లాలోని 22 బృహత్‌ పల్లెప్రగతి వనానికి బోర్‌వెల్‌, మోటర్లు బిగిస్తున్నారు. వీటికి చెల్లించే నిధులను ఏ ఫండ్‌ నుంచి కేటాయిస్తున్నారో తెలియక అధికారులు తికమక పడుతున్నారు. మార్చి నెలాఖరుకు ఖర్చు చేయాలని ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఏజెన్సీలకు బిల్లులు చెల్లించాలని మండల అధికారులపై ఒత్తిడి తెస్తునట్టు సమాచారం. 


Updated Date - 2022-01-20T04:16:08+05:30 IST