నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలపై శ్రద్ధ వహించాలి

ABN , First Publish Date - 2021-06-24T05:44:50+05:30 IST

నర్సరీ లు, పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీపీ పెండెం సుజాత అన్నారు.

నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలపై శ్రద్ధ వహించాలి
లక్ష్మీపురంలో పల్లెప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న ఎంపీపీ సుజాత

గరిడేపల్లి రూరల్‌/మఠంపల్లి,(మేళ్లచెరువు), జూన్‌ 23: నర్సరీ లు, పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీపీ పెండెం సుజాత అన్నారు. మండలంలోని లక్ష్మీపురం, అబ్బిరెడ్డిగూ డెం, సర్వారం గ్రామాలోని నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను జెడ్పీ టీసీ పోరెడ్డి శైలజతో కలిసి పరిశీలించారు. లక్ష్మీపురం గ్రామ శా గ్రిగేషన్‌ షెడ్డులో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి జీవన ఎరువును తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. ప్రజాప్రతి నిధులు, అధికారులు సమన్వయంతో నర్సరీలు, పల్లె ప్రకృతి వ నాలను కాపాడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు చిలక కాశ య్య, వెంకటమ్మ, కర్నాటి నాగిరెడ్డి, ఎంపీడీవో వనజ, ఎంపీవో లా వణ్య, ఎంపీటీసీ ఇసాక్‌, ఏపీవో మహేష్‌ పాల్గొన్నారు. మేళ్లచెర్వు మండలంలోని వెల్లటూర్‌ గ్రామంలో వైకుంఠ ధామం, పల్లెపకృతి వనం, నర్సరీ, సెగ్రిగేషన్‌షేడ్‌, డంఫింగ్‌యార్డులను అభివృద్ధి పనుల ప్రత్యేకాధికారి శ్రీధర్‌ పరిశీలించారు. మెగాపార్కు ఏర్పాటు కోసం స్థల దాతలు ముందు రావాలన్నారు. ఆయన వెంట ఎంపీ డీవో ఇస్సాక్‌ హుస్సేన్‌, పంచాయతీ అధికారి వీరయ్య, ఏపీవో రాజు, సర్పంచ్‌ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T05:44:50+05:30 IST