భర్త పర్యటనపై గోప్యత... నర్సుపై వేటు

ABN , First Publish Date - 2020-03-29T09:46:51+05:30 IST

ఓ పక్క కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుంటే, విదేశాల నుంచి వచ్చిన భర్త సమాచారాన్ని గోప్యంగా ఉంచిందో...

భర్త పర్యటనపై గోప్యత... నర్సుపై వేటు

మచిలీపట్నం, విజయవాడ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఓ పక్క కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుంటే, విదేశాల నుంచి వచ్చిన భర్త సమాచారాన్ని గోప్యంగా ఉంచిందో నర్సు. దీంతో ఆమెను విధుల నుంచి తొలగిస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మచిలీపట్నంలోని జిల్లాకేంద్ర ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సు భర్త ఈ నెల విదేశీ పర్యటన ముగించుకొని మచిలీపట్నం వచ్చారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆ సమాచారాన్ని నర్సు అధికారులకు తెలియజేయలేదు. ఆ వ్యక్తి మచిలీపట్నం, విజయవాడ తదితర ప్రాంతాల్లో పర్యటించినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.


వైద్యులకు కరోనా రక్షణ పరికరాలు ఇవ్వండి: ఐఎంఏ 

 కరోనా నివారణ కార్యక్రమాల్లో ఐఎంఏ వైద్యులను భాగస్వాములను చేయాలని, వారికి రక్షణ పరికరాలు ఇవ్వాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్వీకే ప్రసాద్‌రెడ్డి ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-03-29T09:46:51+05:30 IST