Abn logo
Jul 28 2021 @ 00:18AM

నెంబరు ప్లేట్లు సక్రమంగా లేకుంటే కేసులు

రాజమహేంద్రవరంలో మెకానికర్లకు అవగాహన కల్పిస్తున్న సీఐ

  • ఐదురోజుల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి 2324 కేసులు నమోదు
  • అర్బన్‌ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

రాజమహేంద్రవరం సిటీ, జూలై 27: రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరి ధిలో మోటార్‌సైకిళ్లు, కార్లు వినియోగించే వారంతా వాహనాలకు నెంబరు ప్లేట్లు నిబంధనలకు అనుగుణంగా వుండేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఐశ్వ ర్య రస్తోగి ఆదేశించారు. ఈ మేరకు ఎస్పీ ఆదేశాలతో అర్బన్‌ జిల్లాలో అన్ని పోలీస్‌స్టేషన్లలో సీఐల ఆధ్వర్యంలో బైక్‌, కారు మెకానిక్‌లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. బైక్‌లు, కారులకు నెంబరు ప్లేట్లు సక్రమంగా ఉండా లని సూచించారు. కొన్ని అశాంఘిక శక్తులు కార్లు నెంబర్లు, చేస్‌ నెంబర్లు మార్చి నేరాలకు పాల్పడడం, బైక్‌ నెంబర్లు మార్చి సారా రవాణా చేస్తున్నారని ఇలాంటి నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెకానిక్‌ లకు వాహనాల మరమ్మతులకు వచ్చినప్పుడు ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఐదు రోజుల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి నెంబరు ప్లేట్‌ సక్రమంగా లేని వాహనాలపై 2324 కేసులు నమో దు చేసినట్టు ఎస్పీ తెలి పారు. మెకానిక్‌లు పోలీసులకు సహకరించాలని అను మానం వచ్చిన వాహన వివరాలను 100 కు గాని 9490760794 నెంబరుకు తెలియజేయాలని కోరారు.