Abn logo
Jul 4 2020 @ 16:57PM

బ్రెజిల్‌లో 15 లక్షలు దాటిన కరోనా కేసులు

బ్రసిలియా: కరోనా మహమ్మారి బ్రెజిల్‌ను వణికిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్ వ్యాప్తంగా 42,223 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసులు సంఖ్య 15,39,081కు చేరింది. అంతకుముందు రోజు నమోదైన 48,105 కేసులతో పోల్చితే కొత్తగా నమోదైన కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నట్టు చెప్పాలి. మరోపక్క గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 1,290 మంది మరణించినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 63,174కు చేరింది. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 8,68,000 మంది పూర్తిగా కోలుకున్నారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. అత్యధిక కేసులు నమోదైన దేశంగా మొదటి నుంచి అమెరికానే మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 27 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మార్చి 11న కరోనా మహమ్మారి గురించి ప్రపంచదేశాలకు తెలియజేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి పది లక్షల కరోనా కేసులు నమోదవగా.. 5,23,000 మంది మృత్యువాతపడ్డారు. 

Advertisement
Advertisement
Advertisement