తెలుగు ఖ్యాతిని చాటిన ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2021-01-19T05:09:52+05:30 IST

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని టీడీపీ నేతలు కొని యాడారు.

తెలుగు ఖ్యాతిని చాటిన ఎన్టీఆర్‌
కడపలో రక్తదానం చేస్తున్న టీడీపీ నాయకులు

వర్ధంతిలో టీడీపీ నేతలు

కడప, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని టీడీపీ నేతలు కొని యాడారు. ఎన్టీఆర్‌ 25వ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు కడపలో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూల మాలలు వేసి, పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ, అన్నదానం నిర్వహించారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. బాలక్రిష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు పీరయ్య నేతృత్వంలో రక్తదాన శిబిరం, పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌, అమీర్‌బాబు హాజర య్యారు. ఎన్టీఆర్‌ సినిమా నటుడిగా, ఆంధ్రుల ఆరాధ్య దైవంగా ప్రజల్లో కొలువై ఉన్నారన్నారు. ఎన్టీ ఆర్‌ స్ఫూర్తితో ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చార న్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ చిరస్మర ణీ యంగా వెలుగొందుతార న్నా రు. కొండాయపల్లెలోని ఎన్టీ ఆర్‌ విగ్రహానికి చలపతిరావు ఆధ్వ ర్యంలో నివాళులర్పిం చారు. కడ ప ఇన్‌ఛార్జ్‌ అమీర్‌ బాబు, టీడీపీ నేతలు రామ క్రిష్ణ, రమణ, సుబ్బనా యు డు, రవీంద్ర నాథరెడ్డి, కిష్ణ్ర మూర్తి, సుబ్బారెడ్డి, రవీంద్ర నాధరెడ్డి హాజరయ్యారు. టీడీ పీ మాజీ రాష్ట్ర కార్యదర్శి పోలుదాసు క్రిష్ణమూర్తి అశోక్‌ నగర్‌, మద్రాసు రోడ్డులో అన్న దాన కార్యక్ర మం నిర్వహిం చారు. సీనియర్‌ నాయకుడు సైకిల్‌ కొండయ్యను సన్మానిం చారు. టీడీపీ నగర కార్యదర్శి వికాస్‌హరి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాలులర్పించారు.

Updated Date - 2021-01-19T05:09:52+05:30 IST