NTR ఆరోగ్య వర్సిటీలో బీఎన్‌వైఎస్‌

ABN , First Publish Date - 2022-09-21T21:40:57+05:30 IST

విజయవాడ(Vijayawada)లోని డా.ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌(NTR University of Health Sciences) (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌) - ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌

NTR ఆరోగ్య వర్సిటీలో బీఎన్‌వైఎస్‌

విజయవాడ(Vijayawada)లోని డా.ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌(NTR University of Health Sciences) (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌) - ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సైన్సెస్‌ (బీఎన్‌వైఎస్‌)’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని అనుబంధ కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. అకడమిక్‌ మెరిట్‌, కౌన్సెలింగ్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కౌన్సెలింగ్‌ నాటికి సీట్ల వివరాలు ప్రకటిస్తారు.  తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రైవేట్‌ కళాశాలలు - సీట్లు: గుంటూరు జిల్లా బాపట్లలోని ‘కేర్‌ యోగ, నేచురోపతి మెడికల్‌ కాలేజ్‌’లో 50 సీట్లు; అనంతపురం జిల్లా గుంతకల్‌లోని ‘పతంజలి మహర్షి నేచురోపతి అండ్‌ యోగ మెడికల్‌ కాలేజ్‌’లో 50 సీట్లు ఉన్నాయి.  

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు (ఏఐఎస్‌ఎస్‌సీఈ/ సీబీఎస్‌ఈ/ ఐసీఎస్‌ఈ/ ఎస్‌ఎస్‌సీఈ/ హెచ్‌ఎస్‌సీఈ/ ఎన్‌ఐఓఎస్‌/ఏపీఓఎస్‌ఎస్‌ తదితరాలు) నుంచి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్‌ సబ్జెక్ట్‌లలో జనరల్‌ అభ్యర్థులకు కనీసం 50 శాతం; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 40 శాతం మార్కులు ఉండాలి. అభ్యర్థుల వయసు డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. 2006 జనవరి 2న గానీ ఆ తరవాత గానీ జన్మించిన అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు.     

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.2950; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2360

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 25 

వెబ్‌సైట్‌: ntruhs.ap. nic.in, https://ugbnys.ntruhsadmissions.com

Updated Date - 2022-09-21T21:40:57+05:30 IST