ఎన్టీఆర్‌ శత జయంతికి సర్వంసిద్ధం

ABN , First Publish Date - 2022-05-28T06:29:33+05:30 IST

ఎన్టీఆర్‌ శత జయంతికి సర్వంసిద్ధం

ఎన్టీఆర్‌ శత జయంతికి సర్వంసిద్ధం
ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ ఎంపీపీ దేవినేని రాజా, పక్కన సర్పంచ్‌ ఇందిర, తదితరులు

ఈడుపుగల్లు (కంకిపాడు), మే 27 : ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైందని కంకి పాడు మాజీ ఎంపీపీ  దేవినేని రాజా అన్నా రు. ఈడుపుగల్లులో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా దేవినేని రాజా మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు శనివారం నిర్వ హిం చుకునేందుకు అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం ఆటంకం కల్పిస్తుందన్నారు.  ఈ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ఐదు వేల మందికి అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తోపాటు, వైసీపీ నాయకులు ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలకు ఎన్ని ఆటంకాలు కల్పించినా,  వేడుకలను ప్రజలు విజయంతం చేస్తారన్నారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్‌ పి. ఇందిర, పార్టీ నాయకు లు పుట్టగుంట రవి, షేక్‌ షకార్‌, సుధాకర్‌, రావి సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈడుపుగల్లులో పండుగ వాతావరణం 

 ఈడుపుగల్లులో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ శత జయంతి వేడు కలను ఘనంగా నిర్వహించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈడుపుగల్లు సెంటర్‌లో సుమారు 20ఎకరాల్లో  ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నారులు సైతం సైకిళ్లకు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకుని ప్రాంగణంలో తిరు గుతూ ఉత్సాహంగా కనిపించారు.  బందరు  రోడ్డుపై ట్రాఫిక్‌ సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవతం చేయాలని మాజీ ఎంపీపీ దేవినేని రాజా కోరారు. 

Updated Date - 2022-05-28T06:29:33+05:30 IST