Jun 24 2021 @ 01:26AM

ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్స్‌కు ఎన్టీఆర్‌ వచ్చారు. మేకప్‌ వేసుకున్నారు. చిత్రీకరణ ప్రారంభించారు. రాజమౌళి సూచనల మేరకు నటిస్తున్నారు. కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రణం రౌద్రం రుధిరం’. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఓ స్టూడియోలో హీరోలు ఇద్దరిపై కీలక సన్నివేశాలు, పాట తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. రామ్‌చరణ్‌ సోమవారం నుంచి చిత్రీకరణ చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ కూడా జాయిన్‌ అయ్యారు. జూలై నెలాఖరు వరకూ ఈ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారట. జూలై తొలి వారంలో ఆలియా భట్‌ చిత్రీకరణకు వస్తారని టాక్‌. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తి కానుందని తెలుస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు.


ఫ్యాన్స్‌ నిరంతర అన్న వితరణ

అన్నార్తులను ఆదుకోవాలన్న ఎన్టీఆర్‌ మాటల స్ఫూర్తితో నిరంతర ఆహార వితరణ కార్యక్రమానికి అభిమానులు నడుం బిగించారు. ‘రా హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో అనాదలు, యాచకులు, నిరాశ్రయులు, నిరుపేద ప్రజలకు అల్పాహారం, భోజనంతో పాటు నిత్యావసరాలు, పండ్లు అందిస్తున్నారు. సేవాకార్యక్రమాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు జూలై 1 న rawntr.com పేరుతో సంస్థ సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నారు. అందులో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఈ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.