సడెన్‌గా KCRకు ఎన్టీఆర్‌పై ప్రేమ పుట్టుకొచ్చింది: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-06-09T20:38:58+05:30 IST

ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌కు మాజీ సీఎం ఎన్టీఆర్ పేరును మార్చింది సీఎం కేసీఆరేనని టీపీసీసీ అధ్యక్ష్యుడు రేవంత్‌రెడ్డి

సడెన్‌గా KCRకు ఎన్టీఆర్‌పై ప్రేమ పుట్టుకొచ్చింది: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌కు మాజీ సీఎం ఎన్టీఆర్ పేరును మార్చింది సీఎం కేసీఆరేనని టీపీసీసీ అధ్యక్ష్యుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారికంగా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి చేయడం లేదని తప్పుబట్టారు. కేసీఆర్ (KCR) చర్యలను ఎన్టీఆర్ అభిమానులు మరిచిపోరన్నారు. ఎన్టీఆర్ జయంతి రోజు బారులు కట్టి ఎన్టీఆర్‌ని పొగిడితే చరిత్ర మారదు కదా అని ప్రశ్నించారు. సడెన్‌గా సీఎం కేసీఆర్‌కి ఎన్టీఆర్‌పై ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. ఎన్ని వేషాలు వేసినా.. సీఎం కేసీఆర్‌ని ప్రజలు నమ్మరని తెలిపారు. హైదరాబాద్‌లో సమావేశాలు పెట్టినంత మాత్రాన బీజేపీ బలపడదని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు.

Updated Date - 2022-06-09T20:38:58+05:30 IST