ఎన్టీఆర్‌ ఆశయాల బాటలో నడవాలి

ABN , First Publish Date - 2022-05-29T06:08:14+05:30 IST

పేద ప్రజల గుండెచప్పుడుగా వారి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగించిన టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్య మంత్రి రామారావు ఆశయాల బాటలోనే మనం నడవాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్‌ ఆశయాల బాటలో నడవాలి
మార్టూరు: క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తదితరులు

 ఎమ్మెల్యే ఏలూరి పిలుపు 

 వాడవాడలా నివాళులు 

  పలుచోట్ల అన్నదానం

మార్టూరు, మే 28: పేద ప్రజల గుండెచప్పుడుగా వారి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగించిన టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్య మంత్రి రామారావు ఆశయాల బాటలోనే మనం నడవాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మండలంలోని ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయంలో  శనివారం ఉదయం ఆయన విగ్రహానికి సాంబశివరావు పూలమాలలువేసి  నివాళులర్పించారు. అనంతరం మహానాడుకు ఒంగోలు వెళుతూ క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఖమ్మం పార్లమెంట్‌ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు, తదితర పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఏలూరి కేక్‌ కట్‌ చేశారు కార్యక్రమంలో శానంపూడి చిరంజీవి, శివరాత్రి శ్రీను, అడుసుమల్లి హర్ష, రావిపాటి సీతయ్య తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా మార్టూరులోని మండల కాంప్లెక్స్‌, బడ్డురాయి సెంటరు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. 

ఇసుకదర్శి, డేగరమూడి, ఇతర గ్రామాల్లోనూ  ఎన్‌టీఆర్‌ జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించారు.

యద్దనపూడి మండలంలోని గన్నవరం, యద్దనపూడి, పోలూరు, అనంతవరం, సూరారపల్లి యనమదల పూనూరు తదితర గ్రామాలలో  ఎన్టీఆర్‌ విగ్రహాలకు పార్టీ నాయకులు  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో గుదే తారక రామారావు, కోయ సతీష్‌, రంగయ్య చౌదరి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చీరాలలో.. చీరాల, మే 28: ఎన్టీఆర్‌ శతజయంతి ఉతవాలను శనివారం గ్రామగ్రామాన నిర్వహించారు. ఆ పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్య స్థానిక బస్టాండ్‌ సెంటర్లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఇనుడింపచేసిన స్వర్గీయ నందమూరి తారకరామరావు చిరస్మరణీయుడని కొనియాడారు. అనంతరం కేట్‌ కట్‌చేసి అందరికి పంచిపెట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కౌతవరపు జనార్ధన్‌, డేటా నాగేశ్వరరావు, బాబ్జి, శ్రీనివాస్‌తేజ, పాండు తదితరులు పాల్గొన్నారు.

వేటపాలెం మండలంలో పలుచోట్ల ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను నిర్వహించారు. రావూరిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాశిక వీరభద్రయ్య కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు. 

బల్లికురవలో.. బల్లికురవ, మే 28: మండలంలోని వేమవరం, గంగపాలెం, బల్లికురవ, నక్కబొక్కలపాడు, కొమ్మినేనివారిపాలెం, కొప్పెరపాడు, రాజు పాలెం, అంబడిపూడి, ఉప్పుమాగులూరు, కొప్పెరపాలెం, వల్లాపల్లి గ్రామా లలో ఎన్టీఅర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పూలమాలలు   నివాళులర్పించారు. కార్యక్రమాలలో నేతలు దూళిపాళ్ల హ నుమంతరావు, అమరనేని కాశీవిశ్వనాధం, గొట్టిపాటి ఆదిబాబు,బెల్లంకొండ సుబ్బారావు  హర్ష, దద్దాల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

 చిరస్మరణీయుడు ఎన్టీఆర్‌

పంగులూరు, మే 28:  స్వర్గీయ ఎన్టీ. రామారావు ప్రజల హృదయాలలో చిరకాలం చిరస్మరణీయునిగా నిలిచి  ఉంటారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపా టి రవికుమార్‌ అన్నారు. మండలంలోని ముప్పవరంలో ఎన్టీఆర్‌ విగ్రహా నికి రవికుమార్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు రావూరి రమేష్‌,  కేవీ సుబ్బారావు, కుక్కపల్లి ఏడుకొండలు, చింతల సహదేవుడు, నార్నె సుబ్బారావు, యింటూరి పూర్ణయ్య, బ్రహ్మానందస్వామి, వరపర్ల సుబ్బారావు, దాసరి హను మంతరావు తదితరులు పాల్గొన్నారు.

పర్చూరులో.. పర్చూరు, మే 28: మండలంలో ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. పర్చూరు బొమ్మల సెంటర్‌లో టీడీపీ మండల,  పట్టణ అధ్యక్షులు షేక్‌ షంషుద్దీన్‌, అగ్నిగుండాల వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌చేశారు. అలాగే, నాగులపాలెం, అడుసుమల్లి, ఉప్పుటూరు, వీరన్నపాలెం, చెరుకూరు, చిననందిపాడు, నూతలపాడు, అన్నంబొట్లవారిపాలెం, బోడవాడ, తిమ్మరాజుపాలెం తదితర గ్రామాల్లోనూ ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. వీరన్నపాలెంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ మక్కెన శేఖర్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. 

కారంచేడు మండల కేంద్రంలోని  చినవంతెన సెంటర్‌లో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బాలిగ శివపార్వతి, ఎంపీటీసీ నక్కా శేషారత్నం, వార్డు మెంబర్‌ పాతూరి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో  ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు.   ఆదిపూడి, దగ్గుపాడు, తిమిడితపాడు, స్వర్ణ తదితర గ్రామాల్లోనూ నిర్వహించారు.

ఎన్టీఆర్‌ విగ్రహానికి  పూలమాలలు వేసిన కుప్పం నేతలు

అద్దంకి, మే 28: మహానాడులో పాల్గొనేందుకు వచ్చి శుక్రవారం  రా త్రి అద్దంకిలో బస చేసిన కుప్పం నియోజకవర్గానికి చెందిన మార్కెట్‌  కమిటీ మాజీ  చైర్మన్‌ ఆర్‌.చంద్రశేఖర్‌, మండల పార్టీ అధ్యక్షుడు టీఎం  నాయు డు,  మాజీ జడ్పీటీసీ బేతప్ప నాయుడు తదితరులు శనివారం ఉదయం మహానాడుకు బయలుదేరి  వెళ్తూ కాకానిపాలెంలోని ఎన్టీఆర్‌ వి గ్రహానికి పూలమాలలు  వేసి నివాళులు అర్పించారు. కుప్పం నేతలు ఉ ద్వేకంగా చేసిన ప్రసంగాలు కార్యకర్తలు మరింత ఉత్తేజ పరిచాయి.

 అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం, న ర్రావారిపాలెం లలో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాత శివాలయం  వద్ద జెండా ఆవిష్కరణ చేసి  కేక్‌ ను కట్‌ చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ లో  కార్మిక పరిషత్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చి త్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఎన్టీఆర్‌ వి గ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  మండలంలోని మణికేశ్వరం లో ముస్లింలు  పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్‌ చి త్రపటానికి  పూలమా లలు వేసి నివాళులు అర్పించారు.  కార్య క్రమాలలో బాపట్ల పార్లమెంట్‌ టీడీపీ డాక్టర్స్‌  సెల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఫణీంద్రబాబు, మాజీ ఎంపీపీ మన్నెం ఏడుకొండలు, మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు, మన్నం  త్రిమూర్తులు, కూరపాటి వంశీకృష్ణ, గొట్టిపాటి  శ్రీనివాసరావు, ధర్మవరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

చినగంజాంలో.. చినగంజాం, మే 28: మండలంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ  కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యాలయ ప్రాంగణంలో పార్టీ జెండాను టీడీపీ మండల అధ్యక్షుడు పొద వీరయ్య ఆవిష్కరించారు. తదనంతరం పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పలు వాహనాలలో మహానాడుకు తరలివెళ్లారు. చింతగుంల్లి గ్రామంలో సర్పంచ్‌ యార్లగడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతిని నిర్వహించారు. 

మేదరమెట్లలో.. మేదరమెట్ల, మే 28: ఎన్‌టిఆర్‌ శత జయంతి వేడుకలను రావినూతల, మేదరమెట్ల తదితర గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.  పమిడిపాడులో శ్రీకృష్ణ అ వతారంలో ఉన్న ఎన్‌టీఆర్‌ కటౌట్‌కు పూల మాలలు వేసి నివాళులర్పించి టీడీపీ సీనియర్‌ నాయకులు చెన్నుపాటి హరిబాబు కేక్‌ కట్‌ చేశారు. రావినూతలలో కారుసాల నాగేశ్వర రావు, బాబు ఆధ్వర్యంలో ఎన్‌టి రామారావు విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. యూనియన్‌ బ్యాంక్‌ ఉద్యోగి శ్రీనివాసరావు విద్యార్థు లకు 5 వేల రూపాయల ఉపకార వేతనాన్ని అందజేశారు. మేదరమెట్ల గాంధీ నగర్‌లో గొట్టిపాటి యూట్‌ ఆధ్వర్యంలో పార్టీ జండాను  మన్నె రామారావు ఆవిష్కరించారు. కేక్‌ కట్‌ చేశారు. 

కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు జాగర్లమూడి జయకృష్ణ, క ర్నాటి పూర్ణచంద్రరావు, మేదరమెట్ల శ్రీనివాసరావు, తూనం నేని హనుమం తరావు,  బొల్లెపల్లి సుబ్బారావు, మారెళ్ల శేషయ్య, హనుమంతరావు, మో పర్తి లక్ష్మీనారాయణ, కారుసాల గురుబాబు, మందా నాగేశ్వరరావు, శ్రీనివా సన్‌, హనుమయ్య, పినాకిని బసయేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T06:08:14+05:30 IST